అలాంటి వాచ్ కలిగి ఉన్న ఏకైక భారతీయుడుగా హార్దిక్ పాండ్యా.. ఖరీదు తెలిస్తే గుండె గుబేల్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, వ్యక్తిగత జీవితంలోనూ అంతే విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడతాడు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, వ్యక్తిగత జీవితంలోనూ అంతే విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడతాడు. తాజాగా అతని లగ్జరీ వాచ్‌ల కలెక్షన్ చూసి ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన 'రిచర్డ్ మిల్లే RM 56-03 బ్లూ సఫైర్' వాచ్‌తో హార్దిక్ పాండ్యా కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రూ. 53.2 కోట్ల విలువైన ఈ అల్ట్రా లగ్జరీ వాచ్ తో వున్న ఫొటోస్ సోషల్ లో మీడియా లో వైరల్ అవుతున్నాయి.
లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ హార్దిక్:
హార్దిక్ పాండ్యాకు ఖరీదైన వస్తువులు, ముఖ్యంగా బ్రాండెడ్ వాచీలు సేకరించడం ఒక హాబీ. రోలెక్స్, హుబ్లోట్ వంటి ఎన్నో టాప్ బ్రాండ్స్ అతని దగ్గర ఉన్నప్పటికీ, అతనికి అత్యంత ఇష్టమైన బ్రాండ్ మాత్రం 'రిచర్డ్ మిల్లే'. ఇక గతంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కూడా కోట్ల విలువైన వాచ్‌తో కనిపించి వార్తల్లో నిలిచాడు. ఇక కేవలం ఆటలోనే కాదు, స్టైల్ స్టేట్‌మెంట్‌లోనూ తనకు సాటి ఎవరూ లేరని పాండ్యా నిరూపిస్తూనే ఉంటాడు.
ప్రపంచంలోనే కేవలం 3 వాచీలు:
ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న 'రిచర్డ్ మిల్లే RM 56-03 బ్లూ సఫైర్' వాచ్ సామాన్యమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాచీలు కేవలం 3 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంతటి అరుదైన, అత్యంత ఖరీదైన టైమ్‌పీస్‌ను సొంతం చేసుకున్న ఏకైక భారతీయుడిగా హార్దిక్ పాండ్యా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ అరుదైన వాచ్ ధర సుమారు రూ. 53.2 కోట్లు కావడం విశేషం.
ఈ వాచ్ ప్రత్యేకత ఏంటంటే?:
ఈ బ్లూ సఫైర్ వాచ్ అంత ధర ఉండటానికి ఒక బలమైన కారణం ఉంది. ఇది పూర్తిగా 'సఫైర్ క్రిస్టల్' నీలమణితో చెక్కబడింది. ఇక దీనివల్ల వాచ్ లోపల ఉండే మెకానిజం అంతా స్పష్టంగా, ట్రాన్స్‌పారెంట్‌గా కనిపిస్తుంది. పైగా ఇది ఎంత దృఢమైనదంటే.. దీనిపై ఎలాంటి స్క్రాచెస్ పడవు, అంత తేలిగ్గా పగిలిపోదు. ఇక వాచ్ మేకింగ్ రంగంలోనే ఇదొక అద్భుతమైన సృష్టిగా నిపుణులు చెబుతుంటారు.
మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే హార్దిక్ పాండ్యా, ఆఫ్ ది ఫీల్డ్ తన విలాసవంతమైన లగ్జరీ కలెక్షన్స్‌తో ఎప్పుడూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాడు. ఇక రూ. 53 కోట్ల వాచ్‌ను ధరించి, తన రాయల్ లుక్‌తో క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ స్టైల్ ఐకాన్‌గా మరోసారి వార్తల్లో నిలిచాడు.