'గుర్రం పాపిరెడ్డి' టైటిల్ వీడియో: గాడిదతో నరేష్ అగస్త్య రేసింగ్!

వీడియోలో హైలైట్ ఏంటంటే, నరేష్ అగస్త్య గుర్రంపై కాకుండా గాడిదపై రేస్‌లో దూసుకొస్తాడు.;

Update: 2025-05-02 15:40 GMT

‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా టైటిల్ రివీల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. హైదరాబాద్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ డార్క్ కామెడీ సినిమా టైటిల్ వీడియోను రీసెంట్ గా విడుదల చేశారు. ఇక హార్స్ రేస్ బ్యాక్‌డ్రాప్‌తో మొదలై, సినిమా క్విర్కీ క్యారెక్టర్స్‌ను ఫన్నీగా పరిచయం చేస్తుంది. మురళి మనోహర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా కొత్త కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటోంది.

వీడియోలో హైలైట్ ఏంటంటే, నరేష్ అగస్త్య గుర్రంపై కాకుండా గాడిదపై రేస్‌లో దూసుకొస్తాడు. ఈ సీన్ చూస్తే నవ్వు ఆగదు. ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ కామెంటరీ, విట్టీ విజువల్స్ వీడియోకు మరింత జోష్ తెచ్చాయి. నరేష్ అగస్త్యతో పాటు ఫరియా అబ్దుల్లా, యోగి బాబు, బ్రహ్మానందం, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వంశీధర్ కోస్గి, జీవన్ కుమార్, జాన్ విజయ్, మోట్టా రాజేంద్రన్ నటిస్తున్నారు.

సినిమాను MJM మోషన్ పిక్చర్స్ & బురా అండ్ సద్ది బ్యానర్‌లో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డా. సంధ్య గోలి సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ టైటిల్ వీడియో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

‘గుర్రం పాపిరెడ్డి’ కథ హైదరాబాద్‌లో జరుగుతుందని మేకర్స్ తెలిపారు. డార్క్ కామెడీ జోనర్‌లో వస్తున్న ఈ సినిమా, యూనిక్ క్యారెక్టర్స్, సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్, షార్ప్ హ్యూమర్‌తో నిండి ఉంటుంది. టైటిల్ వీడియోలోని క్విర్కీ టోన్ సినిమా ఎలా ఉంటుందో చిన్న హింట్ ఇచ్చింది. ఈ సినిమా డార్క్ కామెడీ స్పేస్‌లో కొత్త ఒరవడి తీసుకొస్తుందని అంటున్నారు.

మొత్తంగా, ‘గుర్రం పాపిరెడ్డి’ టైటిల్ వీడియో ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా ఆకట్టుకుంది. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం లాంటి స్టార్ కాస్ట్‌తో సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News