• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్ తో టాలీవుడ్...

సూపర్ స్టార్ తో టాలీవుడ్ డైరెక్టర్.. ఏంటి మ్యాటర్?

| 2023 సంక్రాంతికి బరిలో దిగి వీరసింహరెడ్డితో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు గోపీచంద్ మలినేని మరో సినిమాకు రెడీ అవుతున్నారు

By - Tupaki Desk
Update: 2023-12-12 08:21 GMT

2023 సంక్రాంతికి బరిలో దిగి వీరసింహరెడ్డితో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు గోపీచంద్ మలినేని మరో సినిమాకు రెడీ అవుతున్నారు. ఆ మధ్య ఆయన మెగాస్టార్ చిరంజీవి లేదా మాస్ మహారాజా రవితేజతో సినిమా తెరకెక్కించనున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తమిళ స్టార్ రజనీకాంత్ తో ఆయన మూవీ తీయనున్నట్లు తెగ చర్చ నడిచింది. ఇప్పుడు మళ్లీ ఈ చర్చ ఊపందుకుంది.

సూపర్ స్టార్ రజనీ కాంత్.. నేడు(డిసెంబర్ 12) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖలంతా ఆయనకు విషెస్ చెబుతున్నారు. తమిళనాడులో అనేక ప్రాంతాల్లో తలైవా బర్త్ డేను పండుగలా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా రజనీకి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

"సూపర్‌స్టార్‌ రజనీ కాంత్ సార్ కు జన్మదిన శుభాకాంక్షలు. మీ తేజస్సు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మీకు ఈ సంవత్సరమంతా ప్రేమతో నిండాలని కోరుకుంటున్నాను. #HBDసూపర్ స్టార్ రజినీకాంత్" అని ట్వీట్ చేశారు. అయితే గోపీచంద్ మలినేని ట్వీట్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.

త్వరోలనే రజనీ- గోపీచంద్ కాంబోలో సినిమా రానుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సినిమా కన్ఫామ్ చేయండన్నా అని రిక్వెస్ట్ చేస్తున్నారు. రజనీ తో తీసే సినిమాలో మాస్ సీన్లను నింపేయండని అంటున్నారు. బాలయ్యతో మీరు తీసిన సినిమా.. తలైవాకు నచ్చిందని అందుకే మీ కాంబో కోసం వెయిటింగ్ అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు.

బాలయ్య- గోపీచంద్ కాంబోలో తెరకెక్కిన కంప్లీట్ యాక్షన్ డ్రామా వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాలయ్యకు తగ్గట్టుగా ఈ సినిమాను తీసిన డైరెక్టర్ గోపీచంద్ ను పలువురు ప్రశంసించారు. ఆ సమయంలో రజనీ కూడా గోపీచంద్ కు కాల్ చేశారు. ఈ విషయాన్ని గోపీచందే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

"ఇది నాకు నమ్మలేని క్షణం. సూపర్ స్టార్, తలైవర్ రజనీకాంత్ సార్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన వీరసింహారెడ్డి సినిమాను చూశారు. ఆయనకు సినిమా ఎంతో నచ్చింది. సినిమాను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన భావోద్వేగం ఈ ప్రపంచంలో తనకు అన్నింటి కంటే ఎక్కువ. థాంక్యూ రజనీ సార్" అని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ ను గుర్తుచేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు రజనీ ఫ్యాన్స్.

మరోవైపు, లింగా, కబాలి, కాలా, పేట, దర్బార్‌, అన్నాత్తే తర్వాత రజనీ నటించిన జైలర్ సినిమా దుమ్ముదులిపేసింది. ఆయన కీలక పాత్ర పోషించిన లాల్‌ సలామ్‌ 2024 సంక్రాంతికి విడుదలకానుంది. ప్రస్తుతం ఆయన తన 170వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయ్యాక లోకేశ్‌ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తారు.

Happy Birthday to the eternal superstar @rajinikanth sir.
May your charisma continue to inspire generations. Wishing you an extraordinary year filled with love and adoration. ❤️ 🎉 #HBDSuperstarRajinikanth pic.twitter.com/J34wmGHOpC

— Gopichandh Malineni (@megopichand) December 12, 2023
Tags:    
  • Krackdirector 
  • Superstar 
  • Gopichandmalineni 
  • Rajinikanth 
  • Filmindustry 
  • Raviteja 
  • Birthday 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS