గోపిచంద్ మరో కొత్త ప్రయోగం.. సింగ గ్లింప్స్ లో వైల్డ్ వైబ్
ఈ ప్రాజెక్ట్ కి స్టంట్ మాస్టర్ V వెంకట్ దర్శకత్వం వహిస్తుండటం ఒక స్పెషల్. యాక్షన్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న వెంకట్, మొదటిసారి డైరెక్టర్ గా మారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
మచ్చో స్టార్ గోపిచంద్ చాలా కాలంగా ఒక సరైన సక్సెస్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. భారీ యాక్షన్ సినిమాలు, కమర్షియల్ ఫార్ములాలు వాడుతున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మినిమం హిట్ మార్క్ ను అందుకోవడం కూడా ఈ మధ్య కాలంలో అతనికి కాస్త కష్టంగానే మారింది. ఈ నేపథ్యంలోనే తన రూట్ మార్చి, ఈసారి ఎలాగైనా కొత్తగా ట్రై చేయాలనే కసితో కనిపిస్తున్నాడు.
గోపిచంద్ బర్త్ డే సందర్భంగా అతని 34వ ప్రాజెక్ట్ కి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'సింగ' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. రిలీజ్ చేసిన గ్లింప్స్ లో గోపిచంద్ లుక్ మునుపటి కంటే చాలా వైల్డ్ గా, రఫ్ గా కనిపిస్తోంది. దట్టమైన గడ్డం, మీసాలతో కూడిన ఫేస్ ప్రొఫైల్ తో పాటు అతని కళ్లలో ఒక రకమైన ఇంటెన్సిటీని ఈ ప్రజెంట్ చేశారు.
ఈ ప్రాజెక్ట్ కి స్టంట్ మాస్టర్ V వెంకట్ దర్శకత్వం వహిస్తుండటం ఒక స్పెషల్. యాక్షన్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న వెంకట్, మొదటిసారి డైరెక్టర్ గా మారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్, రా ఏరియా బ్యాక్‌డ్రాప్ ను నమ్ముకుని ఈ కాన్సెప్ట్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్ మాస్టర్ కాబట్టి గోపిచంద్ మార్క్ ఫైట్స్ ను సరికొత్తగా, మరింత వయలెంట్ గా స్క్రీన్ పై చూపే అవకాశం ఉంది.
కిల్లర్ సౌండింగ్ తో మ్యూజిక్ ఇచ్చే శ్యామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ గ్లింప్స్ లో ఆకట్టుకుంటోంది. గోపిచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో భరత వర్ష అనే ఒక సినిమా చేస్తున్నాడు. సంకల్ప్ రెడ్డి సినిమా అంటే ఎలాగూ ఒక విభిన్నమైన కంటెంట్ లోనే ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు ఈ 'సింగ' ప్రాజెక్ట్ కూడా చూస్తుంటే రొటీన్ మాస్ ఎలివేషన్లకు భిన్నంగా ఒక రా అండ్ రస్టిక్ అప్రోచ్ తో వస్తున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది.
బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో సక్సెస్ అవ్వాలంటే కథా బలంతో పాటు ప్రెజెంట్ జనరేషన్ ఆడియన్స్ కు నచ్చేలా సరికొత్త స్క్రీన్ ప్లే ఉండటం చాలా అవసరం. 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపిచంద్ సరసన అనార్కలి నజర్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి వరుస ఫ్లాపుల తర్వాత కొత్తగా ట్రై చేస్తున్న గోపిచంద్ కు ఈ మాస్ యాక్షన్ అటెంప్ట్ ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. కేవలం టైటిల లుక్ తోనే ఒక ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసిన ఈ టీమ్, ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ ఇస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.