వింటేజ్ కు బైబై.. న్యూ మాస్ రూట్లో బాలయ్య ప్లాన్!
నందమూరి బాలకృష్ణ అనగానే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, భారీ డైలాగులు గుర్తొస్తాయి. కానీ ఈసారి రూట్ పూర్తిగా మారబోతోందని సంకేతాలు అందుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ అనగానే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, భారీ డైలాగులు గుర్తొస్తాయి. కానీ ఈసారి రూట్ పూర్తిగా మారబోతోందని సంకేతాలు అందుతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఎన్బీకే111 సినిమాపై ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వీరసింహారెడ్డి లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ఫ్యాన్స్ ఫోకస్ ఎక్కువగా ఉంది. అయితే ఈసారి రొటీన్ మాస్ మసాలా కథ కాకుండా ఒక కొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్ ను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఈ కొత్త ప్రయత్నం ఏంటనేది సులభంగా అర్థమవుతుంది. డార్క్ రగ్గడ్ థీమ్ లో డిజైన్ చేసిన ఈ ప్రీ లుక్ లో ఒక భారీ ఇనుప గొలుసును చూపించారు. దానిపై వింటేజ్ కాలానికి బైబై చెబుతూ ఇకపై కేవలం న్యూ ఏజ్ మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. కింద మూడు పవర్ ఫుల్ బుల్లెట్స్ కూడా పెట్టారు. ఈ విజువల్ సెటప్ గమనిస్తే కేవలం తొడగొట్టే పాత్రలు కాకుండా స్టైలిష్ గా సాగే మైండ్ గేమ్ యాక్షన్ ఇందులో ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్ డేట్ ను జూన్ 10న ఇవ్వడానికి టీమ్ అంతా రెడీ అవుతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. బర్త్ డే రోజున ఏదో ఒక రొటీన్ లుక్ రిలీజ్ చేయడం చూస్తుంటాం. కానీ ఈసారి మాత్రం కథలోని ఇంటెన్సిటీని, హీరో క్యారెక్టరైజేషన్ ను రివీల్ చేసేలా ఒక సాలిడ్ గ్లింప్స్ లేదా టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ అప్ డేట్ కోసమే అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అక్కడ ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. గోపీచంద్ మలినేని బాలయ్యను మునుపెన్నడూ చూడని ఒక డైనమిక్ రోల్ లో ప్రెజెంట్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. ముంబై అండర్ వరల్డ్ లేదా సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఈ కథలో ఉండే ఛాన్స్ ఉంది. సీనియర్ హీరో ఇమేజ్ ను ప్రెసెంట్ జనరేషన్ కు నచ్చేలా సరికొత్త స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నాడట.
ఈ ప్రాజెక్ట్ లో మరో బిగ్ అట్రాక్షన్ మంచు మనోజ్. చాలారోజుల తర్వాత మనోజ్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్, కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. బాలయ్య లాంటి మాస్ పర్సనాలిటీకి పోటీగా మనోజ్ క్యారెక్టర్ ను చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారట. వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే మెయిన్ హైలైట్ కానున్నాయి. ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఇక బాలయ్య ఇమేజ్ కు ఈ మోడ్రన్ టేకింగ్ కరెక్ట్ గా సింక్ అయితే బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయం. జూన్ పదిన రాబోయే అప్ డేట్ తో ఈ సినిమా రేంజ్ ఏంటనేది పూర్తిగా తేలిపోనుంది.