• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ్లోబ‌ల్ స్టార్ రామ్...

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ని ఇడ్లీ-వ‌డ అంటారా?

| అక్క‌డ జ‌రిగిన స‌న్నివేశాన్ని రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హసన్ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసారు.

By - Tupaki Desk
Update: 2024-03-05 06:19 GMT

అంబానీ ఇంట కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కి అవ‌మానం జ‌రిగిందంటూ మీడియాలో క‌థ‌నాలు సంచ‌ల‌నం సృష్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ని షారుక్ ఖాన్ 'ఇడ్లీ వ‌డ' అంటూ అవ‌మానించార‌ని చ‌ర‌ణ్ అభిమానులు మంటెత్తిపోతున్నారు. ఓ పాన్ ఇండియా స్టార్ ని ప‌ట్టుకుని కుబే రుడి ఇంట పెళ్లి వేడుక‌లో అంత‌టి అవ‌మానానికి తెర తీస్తారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌...రామ్ అంటూ పిలిస్తే స‌రిపోదా? మ‌ధ్య‌లో ఇడ్లీ వ‌డ ఎందుకు యాడ్ చేయాలి? దాని అర్ధం ఏంటి? అవ‌మానం కాక అంటూ మండిప‌డుతున్నారు.


అక్క‌డ జ‌రిగిన స‌న్నివేశాన్ని రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హసన్ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. షారుక్ ఖాన్ అలా పిల‌వ‌డం న‌చ్చ‌డం లేద‌ని...అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన‌ట్లు ఆమె దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేయ‌డంతో అభిమానులు మ‌రింత మండిప‌డుతున్నారు. ప్ర‌స్తుతం దానికి సంబంధించిన వీడియోలు ఇంట‌ర్నెట్ లో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. షారుక్ ఖాన్ సినిమాలో చేయాల్సిన కామెడీలు బ‌య‌ట‌కు కూడా చేస్తున్నాడ‌ని అభిమానులు మండిప‌డుతున్నారు.


ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా చేసింద‌ని మ‌రికొంత మంది ఆరోపిస్తున్నారు. అక్క‌డ నాటు నాటు పాట‌కు బాలీవుడ్ స్టార్లు డాన్సు చేయ‌డం.. పాట మ‌ధ్య‌లో చ‌ర‌ణ్ ని ఆహ్వానించ‌డం...షారుక్ ఖాన్ వెకిలి చేష్ట‌లు అన్నీ ప‌నిగ‌ట్టు కుని చేసార‌ని ఆరోపిస్తున్నారు. నాటు నాటు పాట‌కు ఆస్కార్ వ‌చ్చిన‌ప్పుడు స్పందిచ‌ని బాలీవు డ్ తారా లోక‌మంతా ఇప్పుడా పాట‌కు అంబానీ ఇంట వేడుక‌లో డాన్సు చేయ‌డం ఏంటి? ఇదంతా సందేహంగానే ఉందంటున్నారు.

అలాగే షారుక్ ఖాన్ ..చ‌ర‌ణ్ ని అవమానించలేద‌ని ఖండిచ‌ని వ‌ర్గం లేక‌పోలేదు. కొంత మంది నెటి జ‌నులు అది అవ‌మానం కాదు..షారుక్ ఖాన్ అలా పిల‌వ‌డం వెనుక ఇది అస‌లు కార‌ణం అంటున్నారు. షారుఖ్‌ తన మూవీలోని డైలాగ్‌ని చెప్పాడంటూ షారుఖ్ అభిమానులు క్లారిటీ ఇస్తున్నారు. బాద్‌షా నటించిన 'వన్ 2 కా 4' మూవీలో షారుఖ్ ఒక డైలాగ్ అని అభిమానులు వీడియోతో క్లారిటీ ఇచ్చారు. ఆ డైలాగ్‌లో సౌత్‌లో ఫేమస్ అయిన వాటి గురించి షారుఖ్‌ మాట్లాడుతూ.. ఇడ్లీ- వడ -రజినీకాంత్- వెంకటేష్- నాగార్జున అంటూ సంబోధిస్తారు.

ఆ డైలాగ్ నే అంబానీ ఈవెంట్ లో చరణ్‌ని పిలిచేటప్పుడు షారుఖ్ ఉపయోగించారు. రజిని పేరు స్థానంలో రామ్ చరణ్ పేరుని పెట్టి షారుఖ్ ఆ డైలాగ్ చెప్పారు. ఇది తెలియక చాలా మంది షారుఖ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏదైనా నోరు జార‌క ముందు ఉండాలి జాగ్ర‌త్త అన్న‌ది ఇప్పుడు షారుక్ ఖాన్ కి అర్ద‌మై ఉంటుంది.

Shah Rukh Khan invited Ram Charan on stage to dance on Naatu Naatu with him, Salman and Aamir at Ambani pre wedding ceremony. What a moment 🤌pic.twitter.com/fudFSeJgvN

— sohom (@AwaaraHoon) March 3, 2024
Tags:    
  • AnantRadhikaWedding 
  • AnantAmbani 
  • Radhika 
  • MukeshAmbani 
  • Ramcharan 
  • Shahrukhkhan 
  • Salmankhan 
  • Aamirkhan 
  • Upsana 
  • Zebahassan 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS