ఊహించ‌ని విధంగా పాపుల‌రైన ఘాటీ!

ఓ వ‌ర్గం ఆడియ‌న్స్ అయితే సినిమాలోని లొకేష‌న్స్ ను చూసి ఆయా ప్రాంతాల‌ను సంద‌ర్శించాల‌నుకుంటూ ఉంటారు.;

Update: 2025-09-19 11:21 GMT

సినిమాల ఇంపాక్ట్ అవి చూసే ఆడియ‌న్స్ పై ఏ రేంజ్ లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కొంద‌రు అందులోని మంచిని తీసుకుంటే, ఇంకొంద‌రు చెడును మాత్ర‌మే చూస్తారు. మ‌రికొంద‌రు ఆ సినిమాల్లోని హీరో స్టైల్ లేదా డైలాగ్స్ పై ఫోక‌స్ చేస్తారు. అలా ఒక్కో సినిమా ఒక్కో యాంగిల్ లో ఆడియ‌న్స్ ను, వారి దృష్టిని మారుస్తూ ఉంటాయి.

స్విట్జ‌ర్లాండ్ ను డ్రీమ్‌ల్యాండ్ గా మార్చిన య‌ష్ చోప్రా

ఓ వ‌ర్గం ఆడియ‌న్స్ అయితే సినిమాలోని లొకేష‌న్స్ ను చూసి ఆయా ప్రాంతాల‌ను సంద‌ర్శించాల‌నుకుంటూ ఉంటారు. అలా ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో చూపించిన హిడెన్ ప్లేసెస్ సినిమాల వ‌ల్ల పాపుల‌ర్ అయ్యాయి. ఒక‌ప్పుడు య‌ష్ చోప్రా తీసిన ల‌వ్ స్టోరీలు స్విట్జ‌ర్లాండ్ ను డ్రీమ్ ల్యాండ్ గా మార్చ‌గా, రీసెంట్ గా తెలుగు లో వ‌చ్చిన ఓ సినిమా లోని కొన్ని లొకేష‌న్లు ఆడియ‌న్స్ దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్నాయి.

ఘాటీతో ఫేమ‌స్ అయిన లొకేష‌న్లు

ఆ సినిమా మ‌రేదో కాదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్ర‌ధాన పాత్ర‌లో క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఘాటి. సెప్టెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా క‌థ ఆంధ్ర- ఒడిశా బార్డ‌ర్ లో జ‌రగ్గా, సినిమాలోని స‌హ‌జ లొకేష‌న్లు ఆడియ‌న్స్ దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఘాటీలో ప్ర‌కృతి అందాల‌ను చాలా నేచుర‌ల్ గా చూపించిన విధానం ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. మ‌రీ ముఖ్యంగా సినిమాలో దుడుమా రిజ‌ర్వాయ‌ర్, దుడుమా వాట‌ర్‌ఫాల్స్ ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా క‌నిపించ‌గా, మాచ్‌ఖండ్ ప‌వ‌ర్ ప్లాంట్, దాని వించ్ హౌస్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచాయి. వాటితో పాటూ బ‌లాడా కేవ్స్, ఆ కొండ‌లు మ‌రింత ఎట్రాక్టివ్ గా క‌నిపించ‌గా, ఇప్పుడు ఆ కొత్త లొకేష‌న్స్ ను వెతుక్కుంటూ ప‌ర్యాట‌కులు అక్క‌డికి వెళ్తున్నారు.

మొన్న‌టివ‌ర‌కు చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలిసిన ఈ ప్రాంతాల‌న్నీ ఇప్పుడు ఘాటీ సినిమాతో కొత్త గుర్తింపును సంత‌రించుకున్నాయి. ఆ లొకేష‌న్ల‌కు ఇప్పుడెంతో మంది సంద‌ర్శ‌కులు వెళ్తుండటంతో అక్క‌డ కొత్త‌గా లోక‌ల్ బిజినెస్ లు కూడా మొద‌ల‌వుతున్నాయి. ఎప్పుడూ లేనిది అక్క‌డ టీ స్టాల్స్, టూరిస్ట్ గైడ్ లు కూడా క‌నిపిస్తున్నారు. మొత్తానికి ఘాటీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాన్ని అందుకోక‌పోయినా ఎవ‌రూ ఊహించ‌ని ర‌కంగా ఇలా పాపుల‌రైంద‌ని స్వీటీ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

Tags:    

Similar News