• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గేమ్‌ చేంజర్‌' కొత్త...

'గేమ్‌ చేంజర్‌' కొత్త గేమ్‌ ప్లాన్‌..!

| చాలా మంది గేమ్‌ చేంజర్ ను ఈ ఏడాది సమ్మర్ చివరి వరకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-01-18 06:30 GMT

ఆర్‌ఆర్ఆర్ సినిమా విడుదల సమయంలోనే శంకర్‌ దర్శకత్వంలో చరణ్ సినిమాను ప్రకటించారు. దాంతో ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా చరణ్ వస్తాడని అంతా ఆశించారు. గత ఏడాదిలోనే సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేయడంలో విఫలం అయ్యారు.

దర్శకుడు శంకర్‌ మధ్య లో ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయాల్సి రావడం తో గేమ్ చేంజర్ సినిమా కు ఎక్కువ సమయం కేటాయించడం లో విఫలం అయ్యాడు. ఇటీవల ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. దాంతో చరణ్ తో గేమ్‌ చేంజర్ సినిమాను స్పీడ్ గా ముగించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

చాలా మంది గేమ్‌ చేంజర్ ను ఈ ఏడాది సమ్మర్ చివరి వరకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్‌ చేంజర్‌ సినిమాను సమ్మర్ లో విడుదల చేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. గేమ్ చేంజర్ కోసం కొత్త డేట్‌ లను దిల్‌ రాజు పరిశీలిస్తున్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ వరకు గేమ్‌ చేంజర్ సినిమా ముగియబోతుంది. కాస్త స్పీడ్ గా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ చేస్తే జూన్‌ వరకు అయినా విడుదల చేయవచ్చు. కానీ దిల్‌ రాజు మాత్రం హడావుడి లేకుండా మెల్లగానే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గేమ్‌ చేంజర్ సినిమా ను అక్టోబర్ లో గాంధీ జయంతి లేదా దసరా సందర్భంగా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. అప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి సినిమా ను ఆ రెంటిలో ఒకటి ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. దసరా బరిలో చరణ్ దిగితే కచ్చితంగా నైజాం ఏరియాలో సెలవులు కలిసి వచ్చి భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

మరో వైపు రామ్‌ చరణ్‌ తన తదుపరి సినిమాను బుచ్చి బాబు దర్శకత్వంలో షురూ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే బుచ్చి బాబు ఈ సినిమాను ఏప్రిల్‌ లో పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని మెగా కాంపౌండ్‌ నుంచి సమాచారం అందుతోంది. బుచ్చి బాబు సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందేమో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Gamechanger 
  • Gamechangermovie 
  • Ramcharan 
  • Shankar 
  • Dilraju 
  • Shooting 
  • Releasedate 

Similar News

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

Copyright @2026

Powered by Blink CMS