• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'జరగండి జరగండి' ఆగయా.....

'జరగండి జరగండి' ఆగయా.. పాటలో ఏం మార్చారంటే..

| మరోవైపు దర్శకుడు శంకర్ ఇండియన్ 2 తో బిజీగా ఉండడంతో ఈ సినిమా పనులు చాలావరకు ఆలస్యంగా ఫినిష్ అవుతూ ఉన్నాయి.

By - Tupaki Desk
Update: 2024-03-27 04:36 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ కంటే కూడా అప్డేట్స్ కోసమే ఫ్యాన్స్ చాలా కాలం పాటు ఎదురు చూసారు అని చెప్పవచ్చు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఏ సినిమా రూపొందిన కూడా పక్క ప్రణాళికతో ముందుకు కొనసాగుతూ ఉంటుంది. కానీ గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో మాత్రం పరిస్థితులు ఏమాత్రం అనుకోనించలేదు.


మరోవైపు దర్శకుడు శంకర్ ఇండియన్ 2 తో బిజీగా ఉండడంతో ఈ సినిమా పనులు చాలావరకు ఆలస్యంగా ఫినిష్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా సినిమా టీజర్ నుంచి సాంగ్స్ వరకు ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో చాలా కాలం సస్పెన్స్ కొనసాగింది. అందుకు కారణం సినిమా షూటింగ్ అనుకున్నా ప్లాన్ కు తగ్గట్టుగా పూర్తి కాకపోవడమే.

రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చిన తర్వాతనే సినిమా అప్డేట్స్ ఒకదాని తర్వాత మరొకటి ఇవ్వాలి అని అనుకున్నారు. ఇక మొత్తానికి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఒక పాటను విడుదల చేశారు. జరగండి జరగండి. అనే ఈ పాట లిరికల్ వీడియోలో రామ్ చరణ్ - కియార అద్వానీ జోడి మాస్ లుక్స్ తో స్టైలిష్ గా స్టెప్పులు వేశారు. శంకర్ మార్క్ కు తగ్గట్టుగా సెట్ వర్క్ హైలెట్ అయ్యింది.

తమన్ స్వరపరిచిన ఈ పాటను దలేర్ మెహింది, సునీత చౌహన్ పాడారు. గతంలోనే ఈ పాట సోషల్ మీడియాలో లీక్ అయిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు వేరే సింగర్స్ తో పాడించిన థమన్ ఇప్పుడు మాత్రం టాప్ సింగర్స్ చేత పాడించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సాంగ్ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.

ఈ రోజుల్లో ఏ సినిమాకైనా సరే ముందుగా పాటలు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తేనే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టీజర్ ట్రైలర్ కూడా సినిమా బిజినెస్ కు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలుస్తూ ఉన్నాయి. కాబట్టి రాబోయే అప్డేట్స్ మరింత బలంగా ఉండాలి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా విడుదల డేట్ పై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

రామ్ చరణ్ పుట్టినరోజు రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇస్తారు అని ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ దిల్ రాజు ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదు అని అర్థం అవుతుంది. అనుకున్నట్లు ప్లాన్స్ సెట్ అయితే మాత్రం ఈ ఏడాది సమ్మర్ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. మరోవైపు చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Full View
Tags:    
  • Ramcharan 
  • Gamechanger 
  • Jaragandi 
  • Shankar 
  • Thaman 
  • Birthday 
  • Dilraju 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS