• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శంకర్ 'గేమ్' ఛేంజర్.....

శంకర్ 'గేమ్' ఛేంజర్.. ఫ్రస్ట్రేషన్ లో మెగా ఫ్యాన్స్!

| మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గేమ్ ఛేంజ‌ర్‌'

By - Tupaki Desk
Update: 2024-02-20 15:38 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గేమ్ ఛేంజ‌ర్‌'. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చెర్రీ ఫస్ట్ లుక్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే చాలా కాలంగా మరో అప్డేట్ వారిని నిరాశ పరుస్తోంది. మూడేళ్లు దాటినా ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదనే ఉండటం, సినిమా ఎక్కడి దాకా వచ్చిందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియకపోవడంతో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. మేకర్స్ పట్టించుకోవడం లేదంటూ, తమ అసహనాన్ని ఇతర వేదికల మీద బయట పెడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన నేపధ్యంలో ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మెగా ఫ్యాన్స్ ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతుండగా కొందరు అభిమానులు 'గేమ్ ఛేంజ‌ర్' అప్డేట్ అంటూ గట్టిగా అరుస్తూ కనిపించారు. అలానే తాజాగా మెగా మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్' ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ లోనూ ఇదే కొనసాగింది. హైదరాబాద్ లో నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో వరుణ్ తేజ్ కు 'గేమ్ ఛేంజ‌ర్‌' గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఓ మెగాభిమాని దయచేసి రామ్ చరణ్ కు ఫోన్ చేసి 'గేమ్ ఛేంజ‌ర్‌' సినిమా అప్డేట్ అడగమని వరుణ్ తేజ్ ను వేడుకున్నారు. దీనికి స్పందిస్తూ.. "నిజం చెప్పాలంటే నేనూ రోజూ అదే అడుగుతున్నాను. ఈరోజు తిరిగి షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలోనే మీరు కోరుకున్న అప్డేట్స్ వస్తాయని అనుకుంటున్నాను" అని మెగా హీరో బదులిచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం ఫ్యాన్స్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. అందరూ శంకర్ అండ్ టీమ్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

నిజానికి ఈ రెండు సందర్భాలకు, 'గేమ్ ఛేంజ‌ర్‌' సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ అలాంటి పరిస్థితులు వచ్చాయి. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు కాబట్టి, తమ ఆవేదన రామ్ చరణ్ వరకూ చేరుతుందనే అభిమానులు ఈ వేదికలను ఉపయోగించుకుంటున్నారు. మరో నెల రోజుల్లో మెగా పవర్ స్టార్ బర్త్ డే వుంది కనుక, అప్పటికైనా ఏదైనా అప్డేట్ వస్తుందనే చిన్న ఆశతో అడుగుతున్నారు.

గతేడాది రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 'గేమ్ ఛేంజ‌ర్‌' టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసారు. అంటే ఫస్ట్ లుక్ వచ్చి ఏడాది కావొస్తోంది. కానీ ఈ మధ్యలో మరో అప్డేట్ రాలేదు. దీపావళి స్పెషల్ గా 'జరగండి' అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు కానీ, ఇంతవరకూ దాని ఊసే లేదు. సినిమాలో నటించే నటీనటుల బర్త్ డేలు, ఎన్నో ప్రత్యేకమైన రోజులు వచ్చాయి కానీ.. మేకర్స్ మాత్రం పట్టించుకోలేదు. ఈ గ్యాప్ లో #IrresponsibleDilRaju, #WakeUpShankar, #UseLessSVC, #WakeUpDilraju, #GameChangerShelved అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసినా లైట్ తీసుకున్నారు.

అదే సమయంలో ఇతర హీరోల సినిమాలు షూటింగులు పూర్తి చేసుకొని, రిలీజ్ డేట్లు లాక్ చేసుకుంటున్నాయి. కానీ 'గేమ్ ఛేంజ‌ర్‌' విడుదల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. మొన్న సంక్రాంతికే రావాల్సిన సినిమా.. శంకర్ ఇతర కమిట్మెంట్స్ తో లేట్ అవుతూ వస్తోంది. దసరాకు రిలీజ్ చేస్తారని భావించారు కానీ.. ఇప్పుడా ఛాన్స్ లేనట్టే కనిపిస్తోంది. ఆగస్టులో పుష్ప 2, సెప్టెంబర్ నెలాఖరులో OG, వచ్చే సంక్రాంతికి విశ్వంభర సినిమాలున్నాయి. సో డిసెంబర్ నెలలో రామ్ చరణ్ మూవీ రావొచ్చనే టాక్ నడుస్తోంది. కాకపోతే ఇదంతా శంకర్ మీదనే ఆధారపడి వుంటుందని, చెర్రీ లేదా దిల్ రాజు చేతిలో లేదనే మాట వినిపిస్తోంది. ఏదేమైనా చరణ్ పుట్టినరోజు నాటికి 'గేమ్ ఛేంజ‌ర్‌' అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    
  • Gamechangermovie 
  • Ramcharan 
  • Shankar 
  • Varuntej 
  • Kiaraadvani 
  • Tollywood 
  • Operationvalentine 
  • Megafans 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS