• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గేమ్ చేంజర్ టార్గెట్...

గేమ్ చేంజర్ టార్గెట్ ఎంత..?

| శంకర్ దర్శకత్వంలో రాం చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సందడి మొదలైంది

By - Tupaki Desk
Update: 2024-03-28 06:01 GMT

శంకర్ దర్శకత్వంలో రాం చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సందడి మొదలైంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ జరగండి అంటూ రిలీజై హడావిడి చేస్తుంది. శంకర్ మార్క్ సాంగ్ గా అనిపిస్తున్న జరగండి సాగ్ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. శంకర్ సినిమాల్లో ఎప్పుడూ ఉండే సోషల్ మెసేజ్ తోనే ఈ సినిమా కూడా వస్తుందని తెలుస్తుంది. అయితే ఇందులో హీరో ఒక ప్రభుత్వ అధికారిగా కనిపిస్తాడని టాక్.

రాం చరణ్ తో శంకర్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా గేమ్ చేంజర్ ని తెరకెక్కించారని తెలుస్తుంది. 150 కోట్ల దాకా బడ్జెట్ పెట్టిన గేమ్ చేంజర్ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ కు పాన్ ఇండియా క్రేజ్ రాగా ఆ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా కథ కథనం ప్లాన్ చేశాడట శంకర్.

గేమ్ చేంజర్ సినిమా బిజినెస్ లెక్కలు బాగానే ఉండగా RRR తో తారక్ తో కలిసి చేసిన 1000 కోట్ల మార్క్ గేమ్ చేంజర్ టచ్ చేసే అవకాశం ఉందా అని ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే 1000 కోట్లు అంటే ఏమో చెప్పలేం కానీ అందులో సగం 500 కోట్లు అయితే కచ్చితంగా టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ తో రాం చరణ్ కి ఏర్పడిన క్రేజ్ కి 500 కోట్లు కొట్టడం పెద్ద కష్టమేమి కాదు.

శంకర్ మార్క్ సినిమాగా గేమ్ చేంజర్ ఉంటే మాత్రం సినిమా అనుకున్న దాని కన్నా లెక్కకు మించి వసూళు చేస్తుందని చెప్పొచ్చు. గేమ్ చేంజర్ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా విజువల్స్ కూడా ఆడియన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తాయని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా దిల్ రాజు మెగా ప్లాన్ లోనే ఉన్నారని తెలుస్తుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాలో తమిళంలో కూడా భారీ హైప్ ఏర్పరచుకుంది. సో తెలుగు, తమిళ బాక్సాఫీస్ పై రాం చరణ్ తన స్టామినా చూపించాలని చూస్తున్నాడు.

Tags:    
  • Gamechanger 
  • Ramcharan 
  • Shankar 
  • Kiaraadvani 
  • Gamechangertarget 
  • Filmindustry 
  • Gamechangermovie 
  • Kiaran 
  • Megapowerstar 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS