• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్ 2... మెగా...

ఇండియన్ 2... మెగా ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌

| ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన గేమ్‌ చేంజర్‌ ను ఇండియన్ 2 వల్ల ఇంత ఆలస్యం చేస్తూ వచ్చారు

By - Tupaki Desk
Update: 2024-01-02 04:51 GMT

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ తో దర్శక దిగ్గజం శంకర్ రూపొందిస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తి అయింది. తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్‌ ను ముగించిన శంకర్‌ రాబోయే మూడు నెలల పాటు వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ చేయించబోతున్నాడు.

ఇండియన్ 2 సినిమా ను ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్‌ లేదా మే నెలలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇండియన్ 2 సినిమా చాలా కాలం క్రితం ప్రారంభం అయ్యి కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగి పోయి మళ్లీ ప్రారంభం అయ్యింది.

రామ్ చరణ్ తో గేమ్‌ చేంజర్ సినిమాను మొదలు పెట్టిన శంకర్‌ మధ్యలో ఇండియన్‌ 2 ను మళ్లీ మొదలు పెట్టాడు. దాంతో గేమ్‌ చేంజర్ కంటే కూడా ఎక్కువగా ఇండియన్ 2 పై శంకర్ దృష్టి పెడుతున్నాడు అంటూ చాలా మంది విమర్శలు చేస్తూ వచ్చారు.

ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన గేమ్‌ చేంజర్‌ ను ఇండియన్ 2 వల్ల ఇంత ఆలస్యం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇండియన్ 2 పూర్తి అవ్వడం వల్ల ఇక శంకర్ పూర్తి దృష్టిని గేమ్‌ చేంజర్ పై పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నారు.

గేమ్ చేంజర్ సినిమాను ఈ ఏడాది కచ్చితంగా విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. చరణ్‌ మరియు కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ సినిమాను దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేయాలని నిర్మాత దిల్‌ రాజు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి శంకర్‌ అప్పటి వరకు రెడీ చేస్తాడా చూడాలి. ఎందుకంటే ఇండియన్ 3 కూడా ఉందని ఆయన ఆ మధ్య ప్రకటించాడు..!

Tags:    
  • Ramcharan 
  • Gamechanger 
  • Shankar 
  • Megafans 
  • Indian2 
  • Kiaraadvani 
  • Filmindustry 
  • Gamechangermovie 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS