గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవ్వడానికి అన్ని కారణాలా? దిల్ రాజు ఏమన్నారంటే?
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో.. ఏకంగా గ్లోబల్ స్థాయిని సొంతం చేసుకున్నారు రామ్ చరణ్.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో.. ఏకంగా గ్లోబల్ స్థాయిని సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ ఎస్.శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో గేమ్ ఛేంజర్ సినిమా చేశారు. నిజానికి ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లకు పైగా ఖర్చు చేశారు. సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటి పెంచేయడంతో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ఫ్యాన్స్.. కానీ ఈ సినిమా ఊహించని విధంగా మొదటి షోతోనే డిజాస్టర్ ను సొంతం చేసుకుంది.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా వచ్చిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. శంకర్ దర్శకత్వం వహించగా.. ఎస్ . తమన్ సంగీతాన్ని అందించారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ఎస్ జె సూర్య, సునీల్ కీలకపాత్రలు పోషించారు. 2025 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా.. పైగా రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ను దక్కించుకున్న తర్వాత డిజాస్టర్ గా నిలవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో రాజమౌళి సెంటిమెంట్ కూడా తెరపైకి వచ్చింది. రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో అయినా సరే తదుపరి చిత్రంతో డిజాస్టర్ ను మూట కట్టుకోవాల్సిందే అనే కామెంట్లు వినిపించాయి.
అయితే ఈ గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అవ్వడానికి ఎప్పటికప్పుడు పలు కారణాలు వినిపిస్తూనే ఉన్నా.. తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. దిల్ రాజు మాట్లాడుతూ.." ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా పూర్తవడానికి చాలా సమయం పట్టింది. పైగా మూడేళ్లు ఆలస్యం కూడా అయింది. ఎన్నికలు ముగిసాక ఎలక్షన్స్ గురించి చెబితే అసలు ఎవరు ఈ కథకు కనెక్ట్ అవుతారు. పైగా ఈ సినిమాలో కొత్తదనం మిస్సయింది. అంతేకాదు నాలుగు పాటలకే రూ 75 కోట్లు ఖర్చు పెట్టాము. కంటెంట్ లేకపోతే ఎంత మంచి సాంగ్స్ పెట్టినా ఏం లాభం. అందుకే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది' అంటూ అసలు విషయం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు దిల్ రాజు.
నిజానికి కంటెంట్ లేకపోతే ఎంత భారీ బడ్జెట్ చిత్రం అయినా సరే డిజాస్టర్ గా నిలవాల్సిందే అని మరోసారి ఈ చిత్రం నిరూపించింది. ఇక దిల్ రాజు ఈ సినిమాపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా ఎందుకు సినిమాను చేశారు అని కొంతమంది కామెంట్ చేస్తే.. మరి కొంతమంది కంటెంట్ ఇంకాస్త కొత్తగా మార్చి ఉండుంటే డిజాస్టర్ నుంచీ తప్పించుకునేది అనే కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఎలాంటి కారణాలు చెప్పినా ఏం లాభం.. సినిమా వల్ల నిర్మాతలు నష్టపోయారు అనే కామెంట్లు మాత్రం వ్యక్తం చేస్తున్నారు.