మతులు పోగొడుతున్న 'దంగల్' బ్యూటీ
తాజాగా ఫాతిమా బ్లాక్ కలర్ డిజైనర్ దుస్తుల్లో కనిపించింది. ఫోన్ లో సెల్ఫీలు దిగి వాటిని ఇన్ స్టాలో షేర్ చేయడంతో వైరల్ గా మారుతోంది.;
ఫాతిమా సనా షేక్ పరిచయం అవసరం లేదు. `దంగల్` బ్యూటీగా సుపరిచితురాలైన ఈ భామ ఇటీవల వరుస ఫోటోషూట్లతో అభిమానుల్లో హాట్ టాపిగ్గా మారుతోంది. తాజాగా ఫాతిమా బ్లాక్ కలర్ డిజైనర్ దుస్తుల్లో కనిపించింది. ఫోన్ లో సెల్ఫీలు దిగి వాటిని ఇన్ స్టాలో షేర్ చేయడంతో వైరల్ గా మారుతోంది. ఈ భామ ఆల్ బ్లాక్ లుక్ లో మతులు చెడగొడుతోందంటూ ప్రశంసిస్తున్నారు.
అమీర్ ఖాన్ `దంగల్` చిత్రంతో ఫాతిమా సనా షేక్ నటిగా కెరీర్ ప్రారంభించింది. అమీర్ సరసన అవకాశం అందుకుని ఆ తర్వాత అతడితోనే ప్రేమలో పడడంపైనా అభిమానుల్లో చర్చ సాగింది. దంగల్ విడుదలై ఎనిమిదేళ్లయినా కానీ, ఇంకా ఫాతిమా సనా షేక్ కెరీర్ కి బ్రేక్ రాలేదు.
2024 డిసెంబర్ 23 నాటికి దంగల్ ఎనిమిదేళ్ల మైలురాయిని అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రేక్షకులకు అద్భుతమైన ప్రతిభను పరిచయం చేసింది. ఇందులో ఒక కీలక పాత్ర పోషించిన ఫాతిమా సనా షేక్ పేరు మార్మోగింది. ఫాతిమా సనా షేక్ దంగల్ లో నిజజీవిత అథ్లెట్ గీతా ఫోగట్ పాత్రలో నటించింది. రెజ్లింగ్ ఛాంపియన్ గీతా ఫోగట్ పాత్రలో నటించిన ఫాతిమ ప్రశంసలను పొందింది. ఫాతిమా ఇటీవల సామ్ బహదూర్ లో ఇందిరా గాంధీ పాత్రలో నటించింది. ధక్ ధక్ చిత్రంలోను తన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.