గ్లామర్ ప్రపంచం వదిలి.. క్రికెటర్‌తో రహస్య వివాహం!

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు- క్రికెట్ రంగానికి మధ్య ఉన్న అనుబంధం దశాబ్దాల నాటిది.

Update: 2026-06-15 07:30 GMT

భారతీయ చలన చిత్ర పరిశ్రమకు- క్రికెట్ రంగానికి మధ్య ఉన్న అనుబంధం దశాబ్దాల నాటిది. బాలీవుడ్ నటీమణులు, స్టార్ క్రికెటర్ల మధ్య ప్రేమ కథలు, వివాహాలు మీడియాలో .. అభిమానుల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంటాయి. ఎంతో మంది హీరోయిన్లు కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ప్రేమలో పడటం, ఆ తర్వాత వెండితెరకు శాశ్వతంగా దూరమవడం చూశాం. తొంభై ల కాలంలో అలా సంచలనం సృష్టించిన ఒకనాటి క్రేజీ హీరోయిన్ కథ నేటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి నటించి.. అందం, నటనతో ప్రేక్షకులను అలరించిన నటి ఫర్హీన్.

అప్పట్లో ఆమె బాలీవుడ్ దిగ్గజ నటి మాధురీ దీక్షిత్‌ను పోలి ఉండటంతో పరిశ్రమలోకి రాగానే అందరి దృష్టిని ఆకర్షించింది. `జాన్ తేరే నామ్`, `సైనిక్` వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫర్హీన్ తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. మాధురీ దీక్షిత్ లాంటి పోలికలు ఉండటం ఆమె కెరీర్‌కు ఎంతో ప్లస్ అయ్యింది. అయితే కెరీర్ పరంగా ఎంతో మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు చోటుచేసుకుంది. ప్రముఖ వివాదాస్పద క్రికెటర్ మనోజ్ ప్రభాకర్‌తో ప్రేమలో పడింది.

అప్పటికే పెళ్లయి, భార్యాపిల్లలు ఉన్న మనోజ్ ప్రభాకర్.. ఫర్హీన్ కోసం మొదటి కుటుంబాన్ని వదిలిపెట్టడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇద్ద‌రు రహస్యంగా వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఈ వివాహం క్రీడా, సినీ రంగాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పెళ్లి తర్వాత ఫర్హీన్ సినిమా రంగానికి పూర్తిగా గుడ్‌బై చెప్పేసింది. హాలీవుడ్, బాలీవుడ్ ఆఫర్లు వ‌స్తున్నా? వాటన్నింటినీ కాదనుకుని కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇచ్చింది. గ్లామర్ ప్రపంచంలో ఎంతో భవిష్యత్తు ఉన్నా? ప్రేమించిన వ్యక్తి కోసం.. కుటుంబం కోసం కెరీర్‌ను త్యాగం చేయడానికి వెనుకాడలేదు.

నాటి కాలంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లయ్యాక సినీ రంగానికి దూరం కావడం ఆనవాయితీగా ఉండేది.ప్రస్తుతం ఫర్హీన్ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారనే? విషయానికి వస్తే.. ఆమె ఇప్పుడు ఢిల్లీలో భర్త మనోజ్ ప్రభాకర్ -పిల్లలతో కలిసి స్థిరపడ్డారు. వెండితెరకు దూరమైనప్పటికీ ఆమె ఖాళీగా ఉండకుండా సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమన్‌గా మారారు. సొంతంగా కాస్మెటిక్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో కొనసా గుతున్నారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా.. ప్రశాంతమైన కుటుంబ వాతావరణంలో జీవితాన్ని గడుపుతున్నారు.

గ్లామర్ ప్రపంచంలోని వెలుగుల కంటే వ్యక్తిగత సంతోషమే ముఖ్యమని భావించిన నటీమణులలో ఫర్హీన్ ఒకరు. సినిమా రంగంలో ఎంతటి క్రేజ్ ఉన్నా? తాము ఎంచుకున్న జీవిత భాగస్వామితో ప్రశాంతంగా జీవించడమే తమకు తృప్తినిస్తుందని నిరూపించారు. నాటి త్యాగాలు, వివాదాలను అధిగమించి నేడు విజయవంతమైన గృహిణిగా, వ్యాపారవేత్తగా సాగిస్తున్న ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

Tags:    

Similar News