• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OG: తేడా రాకుండా చూస్కో...

OG: తేడా రాకుండా చూస్కో సుజిత్

| సుజిత్ మూవీ మేకింగ్ పరంగా అద్భుతంగా ఉన్న కంటెంట్ విషయంలో ఎక్కడ డీవియేట్ అవుతాడో అనే భయం ఉంది.

By - Tupaki Desk
Update: 2023-08-26 04:54 GMT

యంగ్ డైరెక్టర్ సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం ఓజీ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సెప్టెంబర్ లో నెక్స్ట్ షెడ్యూల్ కి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్యాంకాక్ లో కీలకమైన యాక్షన్ ఘట్టాలని చిత్రీకరిస్తారని తెలుస్తోంది. 30 రోజుల డేట్స్ ఓజీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కేటాయించారంట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2న రాబోతోంది. ఆ రోజు ఓజీ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి సుజిత్ ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఈ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సాహో మూవీ టీజర్ నెక్స్ట్ లెవల్ లో ప్రెజెంట్ చేశారు. అంతకు మించి ఒజీ మూవీ టీజర్ ఉండబోతోందని భావిస్తున్నారు.

అయితే ఇక్కడే అస్సలు టెన్సన్ కూడా పవర్ స్టార్ అభిమానులలో ఉంది. సుజిత్ మూవీ మేకింగ్ పరంగా అద్భుతంగా ఉన్న కంటెంట్ విషయంలో ఎక్కడ డీవియేట్ అవుతాడో అనే భయం ఉంది. సాహో సినిమా టీజర్ వచ్చినప్పుడు కూడా సినిమాపై నెక్స్ట్ లెవల్ హైప్ క్రియేట్ చేశారు. తరుణ్ భాస్కర్ టాక్ షోలో సాహో టీజర్ రిలీజ్ తర్వాత షారుక్ ఖాన్ స్వయంగా ఫోన్ చేసి ప్రశంసించారని తెలిపాడు.

అయితే టీజర్, ట్రైలర్ ఎంత అద్భుతంగా ఆవిష్కరించిన సాహో సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ముఖ్యంగా తెలుగులో అయితే సాహో డిజాస్టర్ అయ్యింది. హిందీలో బయ్యర్లు సేఫ్ అయ్యారు. ఓవరాల్ గా చూసుకున్న ఎవరేజ్ మూవీగానే నిలిచింది. గొప్ప స్టొరీ అయితే సాహో మూవీలో లేదని చెప్పొచ్చు.

ఇప్పుడు ఒజీ సినిమా విషయంలో కూడా పవర్ స్టార్ అభిమానులు అలాగే టెన్సన్ పడుతున్నారు. టీజర్ ని హైప్ క్రియేట్ చేసి ఆ తరువాత మూవీ ఏమైందా తేడా చేస్తాడేమో అని భావిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు సుజిత్ కి ట్యాగ్ చేసి సలహాలు ఇస్తున్నారు. కంటెంట్ తేడా లేకుండా చూస్కో అంటూ చెబుతున్నారు. మరి సుజిత్ ఒజీ సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులకి ఎలాంటి భోనాంజా ఇస్తాడనేది చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Movie 
  • Ogmovie 
  • Sujeeth 
  • Pawankalyan 
  • Dvv 
  • Teaser 
  • Birthday 
  • Powerstar 
  • Shooting 
  • Content 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS