క్రికెటర్‌తో బ్రేకప్ అయ్యాక నటుడితో డేటింగ్?
ఎల్లీ అవ్ రామ్ పరిచయం అవసరం లేదు. సల్మాన్ ఖాన్ కి సన్నిహితురాలిగా ఉన్న ఎల్లీ, అతడు హోస్ట్ చేసిన బిగ్ బాస్ హౌస్ లోను పార్టిసిపెంట్ గా కనిపించింది.;
ఎల్లీ అవ్ రామ్ పరిచయం అవసరం లేదు. సల్మాన్ ఖాన్ కి సన్నిహితురాలిగా ఉన్న ఎల్లీ, అతడు హోస్ట్ చేసిన బిగ్ బాస్ హౌస్ లోను పార్టిసిపెంట్ గా కనిపించింది. బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాల్లో నటించి నటిగా బిజీ అయింది. ఎల్లీ అవ్ రామ్ ఐటమ్ పాటల్లోను మెరిసింది. ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షోల జడ్జిగా కనిపిస్తోంది.
అయితే వీటన్నిటికంటే ఎల్లీని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన విషయం ఒకటి ఉంది. అది క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో ప్రేమాయణం. ఈ జంట చెట్టా పట్టాల్ అంటూ షికార్లు చేసారు. కానీ సడెన్ గా బ్రేకప్ అవ్వడం ఆశ్చర్యపరిచింది. హార్థిక్ టాప్ మోడల్ కం నటి నటాషా స్టాంకోవిక్ ని పెళ్లాడి ఎల్లీ అవ్ రామ్ కి షాకిచ్చాడని కథనాలొచ్చాయి. అయితే హార్థిక్ ఆ తర్వాత నటాషా నుంచి కూడా విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హార్థిక్ విదేశీ అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడని ప్రచారం ఉంది. కానీ ఎల్లీ ఒంటరి.
ఎల్లీ అవ్ రామ్ ఇటీవల డేటింగ్ రూమర్లతో మరోసారి హెడ్ లైన్స్ లో కొస్తోంది. ఎల్లీ ప్రస్తుతం ఆశిష్ చంచలానీ అనే యూట్యూబర్, నటుడితో డేటింగ్ చేస్తోందంటూ ప్రచారం సాగుతోంది. ఆ ఇద్దరి మధ్యా ఫన్, కెమిస్ట్రీ ఒక రేంజులో వర్కవుటైన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్‌లో ఆశిష్ తనను తాను ఎల్లీకి స్పాట్ బాయ్ అని పరిచయం చేసుకున్నాడు. ఎల్లీ దుస్తులు, హ్యాట్ ని సరి చేస్తూ అతడు సాయపడుతున్నాడు. ఈ వీడియో చివరలో సరదా సంభాషణ అందరినీ నవ్వించింది. ``నేను నిన్ను వంతెనపై నుండి నెట్టవచ్చా మేడమ్?`` అని ఆశిష్ ఫన్నీ ప్రశ్నతో నవ్వించాడు. ఆ తర్వాత వారిద్దరి నడుమా సరదా నవ్వులు ఆకట్టుకున్నాయి. ఈ వీడియోకు ఆశిష్ ఇలా క్యాప్షన్ ఇచ్చాడు. ``చివరగా మేం మీకు చెప్పడానికి వేచి చూస్తున్నాం`` అని రాసాడు. ఈ వీడియో చూడగానే నెటిజనులు మీ పెళ్లి కి తేదీ లాక్ అయితే చెప్పండి! అని అడుగుతున్నారు.
యూట్యూబర్ ఆశిష్ చంచలానీ ఈనెల ప్రారంభంలో ఎల్లీ అవ్‌రామ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ధృవీకరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎల్లీతో సన్నిహితంగా ఉన్న అందమైన ఫోటోని కూడా షేర్ చేసాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా సంబంధం గురించి చాలా గుసగుసలు మొదలయ్యాయి. ఆశిష్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్. అతడు నటించిన ఏకాకి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది హారర్ కామెడీ షో. అతడు స్వయంగా దర్శకత్వం వహించి, ACV స్టూడియోస్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేస్తున్నాడు. ఎల్లీ అవ్రామ్ ముంబైలో నివసించే స్వీడిష్ -గ్రీక్ నటి. 2013లో బిగ్ బాస్ 7లో పాల్గొన్న తర్వాత గుర్తింపు పొందింది. మిక్కీ వైరస్, కిస్ కిస్కో ప్యార్ కరూన్, నామ్ షబానా, గుడ్‌బై వంటి చిత్రాలలో నటించింది.