• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నుపుర్ అందానికి టైగర్...

నుపుర్ అందానికి టైగర్ ఫిదా..!

| తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ విడుదల చేశారు. ఏక్ ధమ్ నచ్చేశావే అంటూ ఈ పాట సాగుతుండటం విశేషం.

By - Tupaki Desk
Update: 2023-09-05 13:36 GMT

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ మూవీ పై చాలా ఎక్కువ అంచనాలు ఉన్నాయి. భారతదేశంలోని అతి పెద్ద దొంగ కథ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.


నిజానికి దొంగ కథ, అది కూడా నిజ జీవితానికి సంబంధించినది అంటే, ఆయన చేసిన దొంగతనాలు, పోలీసుల కేసులు లాంటివి ఉంటాయి. అయితే, ఈ మూవీలోని ఆ దొంగ ప్రేమ కథను కూడా పరిచయం చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ విడుదల చేశారు. ఏక్ ధమ్ నచ్చేశావే అంటూ ఈ పాట సాగుతుండటం విశేషం. హీరోయిన్ నుపుర్ సింగ్ వెనక హీరో రవితేజ పడుతున్నారు. ఆయన ఆమె అందాన్ని పొగుడుతున్న పాట ఇది.

అన్ని భాషల్లోనూ ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటను జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచారు. పాట చూడటానికీ, వినడానికి రెట్రో ఫీల్ ని తీసుకురావడం విశేషం. ఇక ఈ పాటను అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించారు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో పాట సాగినట్లు తెలుస్తోంది. ఈ పాటకు డ్యాన్స్ కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ చేశారు. రవితేజ కి కరెక్ట్ గా సూటయ్యే స్టెప్స్ కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ పాటలో హీరో, హీరోయిన్లతో పాటు ఇతర డ్యాన్సర్ల డ్రెస్ , లుక్ లాంటివి కూడా రెట్రో ఫీల్ ని తీసుకురావడం విశేషం.

ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇక, ఈ మూవీ టీజర్ ని ఇటీవల విడుదల చేయగా, పెద్ద రాద్దాంతమే అయ్యింది. ఈ టీజర్ లో ఓ డైలాగ్ కొందరిని కించపరిచేలా ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం సీరియస్ అవ్వడం విశేషం.

ఇక, ఈ సినిమాని అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సూపర్టపురం గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం.

Full View
Tags:    
  • Tollywood 
  • Panindia 
  • Tigernageshwarrao 
  • Raviteja 
  • Nupursanon 
  • Movie 
  • Ekdum 
  • Lyricalsong 
  • Biopic 
  • Vamsee 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS