• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డబుల్ ఇస్మార్ట్.. ఆగని...

డబుల్ ఇస్మార్ట్.. ఆగని వేగం

| పూరి జగన్నాథ్ ఏడాది గ్యాప్ తీసుకొని ప్రస్తుతం రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ మూవీని పాన్ ఇండియా లెవల్ లో చేస్తున్నారు

By - Tupaki Desk
Update: 2023-08-14 04:43 GMT

లైగర్ లాంటి డిజాస్టర్ పూరి జగన్నాథ్ ఏడాది గ్యాప్ తీసుకొని ప్రస్తుతం రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ మూవీని పాన్ ఇండియా లెవల్ లో చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ చిత్రం సిద్ధమవుతోంది. అయితే క్యారెక్టరైజేషన్ మాత్రమే ఇస్మార్ట్ శంకర్ నుంచి తీసుకొని కంప్లీట్ న్యూ స్టోరీతో డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు.


అయితే హీరోయిన్ ఎవరనేది ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ప్రకటించలేదు. వైష్ణవి చైతన్యని ఒక హీరోయిన్ గా ఎంపిక చేశారనే టాక్ ఉన్నా కూడా అందులో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు. అయితే తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ ఫోటోలని షేర్ చేసి ట్వీటర్ లో కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించే పనిలో పూరి జగన్నాథ్ ఉన్నారంట.

సంజయ్ దత్ డేట్స్ తక్కువ తీసుకోవడంతో ఆయన కాంబినేషన్ లో సీక్వెన్స్ అన్ని వేగంగా కంప్లీట్ చేసేయాలని ముందే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన గన్ని గన్నియెల్లి వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.


క్యాస్టింగ్ విషయంలో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా టచ్ ఉండేలా చూసుకుంటున్నారు. మెయిన్ హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ని తీసుకోవాలని భావిస్తున్నారు. ఇంకా ఆమెతో డిస్కషన్ నడుస్తున్నట్లు టాక్. డబుల్ ఇస్మార్ట్ మూవీతో ఎక్కడైతే తన ఇమేజ్ కి దెబ్బ తగిలిందో మళ్ళీ అక్కడే నిలబెట్టుకోవాలని పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా 40 కోట్ల భారీ బడ్జెట్ తో డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి జగన్నాథ్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కించ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. ఆయన నేతృత్వంలో పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఈ రెండు షెడ్యూల్స్ లో కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 8న శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ చిత్రం అటు పూరి, ఇటు రామ్ పోతినేనికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.

Tags:    
  • Doubleismart 
  • Purijagannadh 
  • Charmeekaur 
  • Rampothineni 
  • Sanjaydutt 
  • Ismartshankar 
  • Doubleismartshoot 

Similar News

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS