దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ కి వస్తే..?
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో సెలబ్రిటీ హోదాలో దివ్వెల మాధురి కూడా హౌస్ లోకి వస్తారని టాక్.;
దివ్వెల మాధురి పరిచయం అవసరం లేని పేరు. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉంటున్న ఆమె ఇప్పటికే ఏపీలో స్పెషల్ డిస్కషన్ పాయింట్ అయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో దివ్వెల మాధురి గురించి ప్రత్యేకమైన చర్చ నడుస్తుంది. అలాంటి ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది. ఏంటి నిజమేనా దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందా అంటే పరిస్థితి చూస్తుంటే అవుననేలా ఉన్నాయి.
సీజన్ 9 లో సెలబ్రిటీ హోదాలో దివ్వెల మాధురి..
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో సెలబ్రిటీ హోదాలో దివ్వెల మాధురి కూడా హౌస్ లోకి వస్తారని టాక్. ఐతే అందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో దివ్వెల మాధురి గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అలాంటి పొలిటికల్ గా ప్రభావం ఉన్న పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే తప్పకుండా మంచి ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది.
ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీస్ 9 మందితో పాటు కామన్ మ్యాన్ ని కూడా 9 మెంబర్స్ ని తీసుకుంటారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ హౌస్ లోకి వెళ్లే కామన్ మ్యాన్ ఎంపిక జరుగుతుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 9 సెలబ్రిటీస్ లిస్ట్ కూడా భారీగానే ఉంది. జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, సీరియల్ యాక్ట్రెస్ తనూజ, భగత్, ఒకప్పటి హీరోయిన్ ఆషా శైనీ, హీరోయిన్ సంజన ఇలా కొందరి పేర్లు సోషల్ మీడియాలో డిస్కషన్ లో ఉన్నాయి.
విషయాన్ని వదిలి పెట్టే వ్యక్తి కాదు..
ఇక ఇప్పుడు వారితో పాటుగా దివ్వెల మాధురి కూడా హౌస్ లోకి వస్తారన్న టాక్ నడుస్తుంది. అదే జరిగితే మాత్రం ఈసారి ఆట మరింత రసవత్తరంగా ఉండబోతుందని చెప్పొచ్చు. దివ్వెల మాధురి అంత తేలికగా ఒక విషయాన్ని వదిలి పెట్టే వ్యక్తి కాదు. ఆమె దాకా వస్తే డూ ఆర్ డై రేంజ్ లో పోరాడుతుంది. తను అనుకున్న పని చేసి తీరుతుంది.
అలాంటి గట్స్ ఉన్న వ్యక్తి హౌస్ లోకి వస్తే మాత్రం మిగతా వాళ్లకి కాస్త టెన్షన్ అనే చెప్పొచ్చు. ఆమె హౌస్ లో ఉంటే ఆమె సపోర్టర్స్ అంతా కూడా ఆమెకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బిగ్ బాస్ ఇన్ని సీజన్లలో ఇలా పొలిటికల్ గా సోషల్ మీడియా సెన్సేషన్ అయిన ఒక వ్యక్తిని హౌస్ లోకి తీసుకెళ్తున్నారు. మరి నిజంగానే మాధురి హౌస్ లోకి వస్తారా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.