దివి బికినీ బ్లాస్ట్.. ఇంతలా షాక్ ఇవ్వడానికి రీజనెంటీ?
బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్త్యా అంటే మనందరికీ ఒక క్యూట్ ఇమేజ్ మైండ్ లో ఉంది. ఆమె నవ్వు, మాటతీరు, పద్ధతిగా కనిపించే డ్రెస్సింగ్ స్టైల్ ఆమెకు ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి.;
బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్త్యా అంటే మనందరికీ ఒక క్యూట్ ఇమేజ్ మైండ్ లో ఉంది. ఆమె నవ్వు, మాటతీరు, పద్ధతిగా కనిపించే డ్రెస్సింగ్ స్టైల్ ఆమెకు ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి. కానీ నిన్న ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయ్యారు. గతంలో కూడా గ్లామరస్ గా కనిపించింది. కానీ ఈసారి అంతకుమించి అనేలా షాక్ ఇవ్వడం వైరల్ అవుతోంది. ఎప్పుడూ లేనిది దివి ఇంత బోల్డ్ గా కనిపించడం వెనుక కారణం ఏంటా అని అందరూ చర్చించుకుంటున్నారు.
సముద్ర తీరంలో బ్లూ కలర్ బికినీలో ఆమె దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే, దీన్ని అందరూ చూస్తున్నట్లుగా కేవలం ఒక 'గ్లామర్ షో' లాగానో, లేక సినిమా అవకాశాల కోసం విసిరిన గాలం లాగానో చూడలేం. ఈ ఫోటోలలో ఆమె బాడీ లాంగ్వేజ్ గమనిస్తే ఒక కొత్త విషయం అర్థమవుతుంది.
ఇది సినిమా ఇండస్ట్రీకి పంపుతున్న సిగ్నల్ కంటే, తనకు తాను చెప్పుకుంటున్న ఒక స్టేట్ మెంట్ లా ఉంది. ఇన్నాళ్లు తన చుట్టూ ఫ్యాన్స్ గీసిన 'హోమ్లీ' అనే గీతను చెరిపేసుకుని, తన సొంత వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛగా ప్రకటిస్తున్నట్లుంది. నా శరీరం, నా ఇష్టం, నా కాన్ఫిడెన్స్ అని ధైర్యంగా ప్రపంచానికి చాటిచెబుతున్నట్లుగా ఆమె ఆటిట్యూడ్ కనిపిస్తోంది.
ఒక సెలబ్రెటీగా, ఇన్ని రోజులు ఒక ఇమేజ్ లో ఉండి, హఠాత్తుగా ఇలాంటి ఫోటోలు షేర్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. జనం ఏమనుకుంటారో, ట్రోల్ చేస్తారేమో అనే భయాలను పక్కనపెట్టి, తనకు నచ్చినట్లుగా, తాను కంఫర్టబుల్ గా ఉండటంలోనే అసలైన ఆనందం ఉందని ఆమె నిరూపిస్తోంది. ఇది ఇతరులను మెప్పించడానికి కాకుండా, తన కోసం తాను తీసుకున్న నిర్ణయంలా ఉంది.
నెటిజన్లు కూడా ఈ కొత్త దివిని పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుంటున్నారు. కేవలం అందాన్ని మాత్రమే కాకుండా, ఆమె మెయింటైన్ చేస్తున్న అద్భుతమైన ఫిట్నెస్ ను, ఆమెలోని ఈ డేరింగ్ ఆటిట్యూడ్ ను ప్రశంసిస్తున్నారు. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న విధానం చాలా మందికి ఇన్ స్పిరేషన్ గా అనిపిస్తోంది. ఇక ఎలా చూసుకున్నా సినిమా ఇండస్ట్రీలో కూడా కొత్త తరహా అవకాశాలు రావడానికి మరో అడుగు ముందుకు వేసినట్లు చెప్పవచ్చు. ఇప్పటివరకు చేసింది చిన్న సినిమాలే. సైడ్ క్యారెక్టర్స్ వస్తున్నా ఆమె ఒప్పుకోవాదం లేదని టాక్. మరి రానున్న రోజుల్లో అమ్మడు వెండితెరపై ఇలాంటి సర్ ప్రైజ్ లు ఇస్తుందో లేదో చూడాలి.