• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ చిన్నారితో జెర్సీ...

ఆ చిన్నారితో జెర్సీ డైరెక్టర్ జెట్ స్పీడ్ ప్రాజెక్ట్

| దర్శకుడు గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో హై రేంజ్ లో సక్సెస్ చూడకపోయినా మంచి దర్శకుడిగా స్టార్ హీరోలను ఆకర్షించాడు.

By - Tupaki Desk
Update: 2023-11-10 04:09 GMT

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో హై రేంజ్ లో సక్సెస్ చూడకపోయినా మంచి దర్శకుడిగా స్టార్ హీరోలను ఆకర్షించాడు. ఇక బాలీవుడ్లో అతను అదే కథను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కానీ అక్కడ మాత్రం ఆ సినిమా సక్సెస్ కాలేకపోయింది. దారుణంగా డిజాస్టర్ అయింది. దీంతో రాంచరణ్ తో చేయాలనుకున్న ప్రాజెక్టు కూడా ఆ సినిమా ప్లాప్ కావడంతో క్యాన్సిల్ అయిపోయింది.

అయినప్పటికీ అతనికి అవకాశాలు ఏమి తగ్గడం లేదు. ప్రముఖ నిర్మాతలు అతనితో చిన్న సినిమాలో అయినా చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇక ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే దేవరకొండతో స్పై యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో సినిమా చేస్తున్నాడు. అయితే ఆ ప్రాజెక్టు షూటింగ్ ఈపాటికే కొనసాగుతూ ఉండాలి.

కానీ విజయ్ దేవరకొండ తన పూర్తి ఫోకస్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా పై పెట్టాడు. దిల్ రాజు నిర్మాతగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ఫ్యామిలీ స్టార్ సినిమా సంక్రాంతికి విడుదల చేయాలని కోరుకుంటున్నారు. ఇక విజయ్ ఆ సినిమాతో బిజీగా ఉండడంతో గౌతమ్ ఈ గ్యాప్లో మరొక డిఫరెంట్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.

అందులో సారా అర్జున్ మెయిన్ లీడ్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె చిన్నప్పుడే విక్రమ్ నాన్న సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్గా పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కూడా నటించింది. ఇక గౌతమ్ OTT కోసమే సారా తో కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ పెట్టని కొత్త ప్రాజెక్ట్‌కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితం కానుంది. "పొన్నియన్ సెల్వన్"లో సారా అర్జున్ నటనకు విశేషమైన ప్రశంసలు లభించాయి. ఫ్లాష్‌ బ్యాక్ సన్నివేశాలలో జూనియర్ ఐశ్వర్యరాయ్ పాత్రలో ఆమె చేసిన పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు, ఆమె పూర్తి నిడివిలో సోలో పాత్రలో తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగు పెడుతోంది. సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ ప్రముఖ నటుడు. అతను విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంలో విలన్‌గా కూడా కనిపించారు.

Tags:    
  • Gowthamtinnuri 
  • Jersey 
  • Vijay 
  • Parusuram 
  • Dilraju 
  • Tollywood 
  • Saraarjun 
  • Filmindustry 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS