• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాతిరత్నాలు అనుదీప్ నయా...

జాతిరత్నాలు అనుదీప్ నయా అవతార్..

| అయితే ఇప్పుడాయన నటుడిగా మారారు. ఎన్టీఆర్ బావమరిది నటిస్తున్న నార్నె నితిన్ కొత్త సినిమా మ్యాడ్ లో ఓ పాత్ర పోషించారు

By - Tupaki Desk
Update: 2023-09-01 06:51 GMT

పిట్టగోడ అనే ఫ్లాప్ మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అనుదీప్ .. ఆ తర్వాత 'జాతిరత్నాలు' సినిమాతో ఓవర్ నైట్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. ఒక్క సారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఇదే జోష్ లో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో 'ప్రిన్స్' అనే ద్విభాషా చిత్రం చేయగా అది బోల్తా కొట్టింది. అయితే దర్శకుడిగా ఉన్న ఆయన తనలోని మరో కొత్త కోణాన్ని బయటపెట్టేందుకు రెడీ అయిపోయారు. నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

త‌న ఫన్నీ కామెడీ మాట‌ల‌తో, ఇనోసెంట్ ఎక్స్ ప్రెష‌న్ తో పాపులర్ అయ్యారు అనుదీప్. ముఖ్యంగా ఇంటర్వ్యూల సమయంలో యాంక‌ర్ల ముఖాల్లో ఓ క్వ‌శ్చ‌న్ మార్క్ రెయిజ్ చేయ‌డం, షార్ట్ ఆన్స‌ర్స్ చెప్పడం.. ఇలా రకారకాలుగా సోష‌ల్ మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

అయితే ఇప్పుడాయన నటుడిగా మారారు. ఎన్టీఆర్ బావమరిది నటిస్తున్న నార్నె నితిన్ కొత్త సినిమా మ్యాడ్ లో ఓ పాత్ర పోషించారు. కాలేజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజై ఆకట్టుకుంది. ఇందులో అనుదీప్ కాలేజు కుర్రాళ్లతో పాటు కనిపించి ఆకట్టుకున్నారు. అనుదీప్ కామెడీ టైమింగ్ ఓ రేంజ్ లో ఉన్నట్టు అర్థమవుతోంది. అనుదీప్ తన మార్క్ కామెడీతో బాగానే నటించారని అనిపిస్తోంది.

అసలే అనుదీప్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు అన్న ప్రచారం కూడా ఉంది. మనం చాలా సార్లు ఇంటర్వూలలో చూస్తూనే ఉన్నాం. చూడాలి మరి ఈ సారి నటుడిగా మారి తెరపై ఆయన ఎలాంటి పెర్ ఫార్మెన్స్ ఇచ్చారనేది. ఒకవేళ ఈ చిత్రంలో అనుదీప్ కామెడీ బాగా పండితే.. తాను డైరెక్ట్ చేసే సినిమాలతో పాటు ఇతర చిత్రాల్లోనూ కనిపించే అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఆయన ఏ చిత్రాన్ని డైరెక్ట్ చేయలేదు.

ఇక మ్యాడ్ సినిమా విషయానికొస్తే.. కళ్యాణ్ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో నార్నె నితిన్, రామ్‌ నితిన్‌, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్‌ శోభన్‌, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సితారా, ఫ్యార్చూన్‌ ఫోర్ సంస్థలు సంయుక్తంగా కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ కథ మొత్తం కాలేజ్‌ చుట్టూనే తిరుగుతుందని అర్థమైంది. కాలేజీ గ్యాంగులు, సీనియర్ల ర్యాగింగ్, ప్రేమలు, కొట్లాటలు అన్నింటినీ తాజా ట్రైలర్ లో చూపించారు.

Tags:    
  • Directoranudeep 
  • Jathiratnalumovie 
  • Princemovie 
  • Anudeepkv 
  • Filmindustry 
  • Narnenitin 
  • Tollywood 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS