బ్లాక్ బస్టర్ సినిమా గురించి ఈ విషయం తెలుసా..?

ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.;

Update: 2025-07-17 17:02 GMT

ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా నిజంగానే హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. ఐతే ఈమధ్యకాలంలో ప్రతి సినిమా ఫాలో అవుతున్న ఒక రెగ్యులర్ పంథాని ఈ సినిమా ఫాలో అవ్వలేదట. అదేంటి అంటే ఈ సినిమా ఓటీటీ హక్కులను రిలీజ్ ముందు అమ్మలేదట.

ఈమధ్య స్టార్ సినిమాలన్నీ కూడా సెట్స్ మీద ఉన్నప్పుడే ఓటీటీ డీల్ చేసుకుంటున్నాయి. కోట్ల కొద్దీ బడ్జెట్ కాబట్టి ఓటీటీ సంస్థలు ఇచ్చే అడ్వాన్స్ లు సినిమా బడ్జెట్ కు సపోర్ట్ అవుతున్నాయి. అలా అడ్వాన్స్ లు తీసుకోవడం వల్ల సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఓటీటీలు డిసైడ్ చేసే పరిస్థితి ఏర్పడింది.

ఐతే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మాత్రం దిల్ రాజు రిలీజ్ ముందు ఓటీటీలకు ఇవ్వలేదట. 300 కోట్ల సినిమా కాబట్టి రిలీజ్ తర్వాత ఆ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయట. ఐతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ డీల్ జరగక ముందే రిలీ చేశారన్న విషయాన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూలో రానా చెప్పాడు.

ఆడియన్స్ మంచి సినిమా అయితే థియేటర్లకు వచ్చి చూడాలని అనుకుంటున్నారు. కాబట్టి మనం మంచి సినిమా తీసి వాళ్లకి ఇవ్వాలి. అలా థియేటర్ కు రప్పించేలా సినిమా తీయాలని అన్నారు రానా. ఇదివరకు సరిపోదా శనివారం టైం లో నాని కూడా కాస్త అటు ఇటుగా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం మంచి సినిమా తీస్తే తప్పకుండా ఆడియన్స్ థియేటర్ కి వస్తారని అన్నాడు నాని. సో ఈ ఇద్దరి హీరోలు చెప్పిన దానిలో నిజం లేకపోలేదు. థియేటర్ కి ఆడియన్ కదలాలి అంటే సినిమా చూడాలన్న విధంగా ప్రమోషనల్ కంటెంట్ ఉండాలి. ఆ విషయంలో ఈమధ్య కొన్ని సినిమాలు దూకుడు చూపిస్తున్నాయి.

ఈ సంక్రాంతికి దిల్ రాజు 300 కోట్ల పైన బడ్జెట్ తో తీసిన గేం ఛేంజర్ ఫ్లాప్ కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మాత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. గేం ఛేంజర్ లాసులను దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం ప్రాఫిట్స్ తో కొంత కవర్ చేసుకున్నారు.

Tags:    

Similar News