రణవీర్ 'ధురంధర్'.. అఖండ-2 వల్ల ప్లస్?

ఓవరాల్ ఫస్ట్ వీకెండ్ కల్లా ధురంధర్ మూవీ రూ.90 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా.;

Update: 2025-12-07 08:22 GMT

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లేటెస్ట్ గా నటించిన ధురంధర్ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. దాదాపు 17 ఏళ్ల తర్వాత హిందీ చిత్రసీమ నుంచి వస్తున్న భారీ నిడివి ఉన్న మూవీగా నిలిచింది. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.

కొన్ని చోట్ల ఎమోషన్స్ మిస్ అవ్వడం తప్ప మిగతా సినిమా అంతా బాగుందని అనేక మంది రివ్యూస్ ఇచ్చారు. ముఖ్యంగా మూవీలో రణవీర్ సింగ్ యాక్టింగ్ అదిరిపోయిందని కొనియాడారు. డైరెక్టర్.. మంచి యాక్షన్ ట్రీట్ మూవీ అంటూ ప్రశంసించారు. రన్ టైమ్ కాస్త ఎక్కువైందని, కానీ. క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ సూపర్ అని నెట్టింట రివ్యూస్ చేశారు.

అలా సినిమాకు మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినా.. దాంతో సంబంధం లేకుండా ధురంధర్ మూవీ మంచి వసూళ్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఫస్ట్ డే ఓపెనింగ్స్ రూ.27 కోట్లుగా నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. రెండో రోజు.. తొలి రోజు కన్నా ఎక్కువ సాధించింది ధురంధర్. రూ.31 కోట్ల రాబట్టినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సెకండ్ డే.. నైట్ షోలకు పెద్ద ఎత్తున ఆడియన్స్ తరలి వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు మూడో రోజు సండే కావడంతో.. మరిన్ని వసూళ్లు సాధించేటట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగాయి. ఓవరాల్ ఫస్ట్ వీకెండ్ కల్లా ధురంధర్ మూవీ రూ.90 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా.

విడుదలైన నాలుగు రోజులకే రూ.100 కోట్ల క్లబ్ లో సినిమా ఎంట్రీ ఇవ్వనుందని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ-2 తాండవం మూవీ విడుదల వాయిదా పడడం.. ధురంధర్ కు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. నిజానికి ధురంధర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల అవ్వలేదు.

కానీ ఈ వారం ఒక్క కొత్త తెలుగు సినిమా కూడా థియేటర్స్ లో రిలీజ్ అవ్వకపోవడంతో.. హైదరాబాద్, విజయవాడ వంటి తెలుగు నగరాల్లో ధురంధర్ కు మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. దీంతో వసూళ్లు కూడా సాలిడ్ గా వస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అఖండ-2 వాయిదా.. తెలుగు స్టేట్స్ విషయంలో ధురంధర్ కు కలిసొచ్చిందని చెప్పాలి. మరి ఓవరాల్ గా ధురంధర్ ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News