'ధురంధ‌ర్' పార్ట్ 2లో మ‌రిన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్‌!

`ధురంధ‌ర్‌`.. భార‌త్‌లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. శ‌త్రుదేశం పాకిస్థాన్‌లోనూ ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.;

Update: 2025-12-24 05:21 GMT

`ధురంధ‌ర్‌`.. భార‌త్‌లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. శ‌త్రుదేశం పాకిస్థాన్‌లోనూ ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. బాలీవుడ్ సినీ చ‌రిత్ర‌తో పాటు ఇండియ‌న్ సినిమా దిశ‌నే మారుస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు సృష్టిస్తూ వెయ్యి కోట్ల దిశ‌గా ప‌రుగులు పెడుతోంది. ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా `యూరి` ఫేమ్ ఆదిత్య‌ధ‌ర్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించాడు.

అక్ష‌య్ ఖ‌న్నా, సంజ‌య్‌ద‌త్‌, అర్జున్ రాంపాల్‌, సారా అర్జున్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ ఇప్పుడు టాప్ ఆఫ్ ది వ‌ర‌ల్డ్‌గా మారింది. వాస్త‌విక సంఘ‌ట‌న‌ల‌ని, అంతే వాస్త‌వంగా తెర‌పై ఆవిష్క‌రించింది. ఇండియ‌న్ స్పై ఓ సాధ‌ర‌ణ వ్య‌క్తిగా అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్ కోసం పాక్‌లో అడుగుపెట్టి `ధురంధ‌ర్‌` ఆప‌రేష‌న్‌ని ఎలా మొద‌లు పెట్టాడు? ..ఎలా ముగించాడు అనే ఆస‌క్తిక‌ర‌మైన స్టోరీతో రూపొందిన ఈ సినిమా స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎలాంటి ఎక్స్‌పెక్టేష‌న్స్ లేకుండా సాదాసీదాగా విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ ట్రేడ్ వ‌ర్గాల‌ని షాక్‌కు గుర చేస్తోంది. డిసెంబ‌ర్ 5న విడుద‌లైన ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.900 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త రికార్డు సృష్టించింది. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ విష‌యంలో ఇండియ‌న్ సినిమాల్లోనే అత్య‌ధిక మొత్తాన్ని ద‌క్కించుకున్న సినిమాగా `ధురంధ‌ర్‌` రికార్డు సృష్టించి `పుష్ప 2` రికార్డ్‌ని తుడిచిపెట్టింది. హీరోగా వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న ర‌ణ్‌వీర్‌సింగ్‌కు తిరుగులేని విజ‌యాన్ని అందించి స‌రికొత్త స్టార్‌డ‌మ్‌ని, క్రేజ్‌ని తెచ్చి పెట్టింది.

అంతే కాకుండా కెరీర్ ఇక ముగిసిన‌ట్టేన‌ని కామెంట్‌లు వినిపించిన వేళ `పిక్చ‌ర్ అభీ బాకీహై` అన్న‌ట్టుగా అక్ష‌య్ ఖ‌న్నా కెరీర్‌ని స‌రికొత్త మ‌లుపు తిప్పి టాక్ ఆఫ్ ది ఇండియాగా మారేలా చేసింది. బ‌లోచ్ లీడ‌ర్‌ని క‌లిసే క్ర‌మంలో అక్ష‌య్ ఖ‌న్నా ఎంట్రీ ఇస్తూ వేసిన చిన్న స్టెప్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారి అక్ష‌య్ ఖ‌న్నాని ట్రెండ్ అయ్యేలా చేసింది. ఇందులో అక్ష‌య్ ఖ‌న్నా గ్యాంగ్‌స్ట‌ర్‌ రెమ‌హాన్ బ‌లోచ్ గా క‌రుడుగ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపించాడు.

అంతే కాకుండా ఇందులో చూపించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ చాలా రియ‌లిస్టిక్‌గా ఒళ్లు గ‌గుర్పొడిచే విధంగా ఉండ‌టంతో కొంత మంది టూ మ‌చ్ వయోలెన్స్ అని కామెంట్‌లు చేస్తుంటే మ‌రి కొంత మంది మాత్రం రియ‌ల్‌గా జ‌రిగిందే చూపించారంటున్నారు. ఫ‌స్ట్ పార్ట్‌లో కీల‌క క్యారెక్ట‌ర్ల‌ని ప‌రిచ‌యం చేసి, ఎండ్‌లో రెహ‌మాన్ బ‌లోచ్ క్యారెక్ట‌ర్‌ని ఎండ్ చేసిన ఆదిత్య‌ధ‌ర్ పార్ట్ 2 రివేంజ్ లో మాత్రం ర‌ణ్‌వీర్‌సింగ్ విశ్వ‌రూపాన్ని చూపిస్తూనే వ‌యోలెన్స్‌ని ప‌తాక స్థాయిలో చూపించ‌బోతున్నాడ‌ట‌.

ఈ విష‌యాన్ని ఇందులో రెహ‌మాన్ క్యారెక్ట‌ర్‌కు రైట్‌హ్యాండ్ `డోంగ‌`గా న‌టించిన న‌వీన్ కౌశిక్ `ధురంధ‌ర్ పార్ట్ 2`పై ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించాడు. `ధురంధ‌ర్ పార్ట్ 1`లో చూసిన యాక్ష‌న్, మిస్ట‌రీ, మ్యానిపులేష‌న్ పార్ట్ 2లో 50 రెట్లు అధికంగా ఉంటుంది. నేను ఆ స‌న్నివేశాల‌ని చూశాను. అంద‌రిని షాక్‌కు గురి చేస్తుంది. షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. పార్ట్ 2లో నేను ఉండ‌ను కానీ ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది మాత్రం నేను ఇప్పుడే చెప్పలేను` అంటూ న‌వీన్ కౌశిక్ `ధురంధ‌ర్ పార్ట్ 2`పై షాకింగ్ ఫ్యాక్ట్స్‌ని బ‌య‌ట‌పెట్టి మ‌రింత హైప్‌కు స్కోప్ ఇచ్చాడు. దీంతో పార్ట్ 1 ఓవ‌ర్ డెఓస్ హింస అని నోరెళ్ల‌బెట్టిన విమ‌ర్శ‌కులు పార్ట్ 2 చూసి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News