ధురంధ‌ర్ అనంత‌రం ఆప‌రేష‌న్ సిందూర్!

బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఆదిత్య ధ‌ర్ పేరిప్పుడు పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నం. `ధురంద‌ర్` విజ‌యంతో అత‌డి పేరు ఇండియా అంత‌టా మారుమ్రోగిపోతుంది.;

Update: 2025-12-31 02:30 GMT

బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఆదిత్య ధ‌ర్ పేరిప్పుడు పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నం. `ధురంద‌ర్` విజ‌యంతో అత‌డి పేరు ఇండియా అంత‌టా మారుమ్రోగిపోతుంది. బాలీవుడ్ కి చాలా కాలానికి 1000 కోట్ల హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడిగా వెలిగిపోతున్నాడు. 2025 లో అత‌డే టాప్ డైరెక్ట‌ర్ గా నిలిచాడు. మార్చి లో `ధురంధ‌ర్ 2` కూడా రిలీజ్ అవుతుంది. దీంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. పార్ట్ లో 2 ఎన్ని చాప్ట‌ర్లు ఉంటాయంటూ ఇప్ప‌టి నుంచే దేశ వ్యాప్తంగా చ‌ర్చ మొద‌లైంది. అందులో స్పై ర‌ణ‌వీర్ సింగ్ స‌హా మిగతా పాత్ర‌లు ఎలా ఉంటాయి? ఎంతటి ఎగ్జైట్ మెంట్ కి గురి చేస్తాయి? ఇలా ఒక‌టే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో క‌నిపిస్తుంది.

అలాగే ఈ సినిమా త‌ర్వాత ఆదిత్య చేయ‌బోయే త‌ర్వాత సినిమా ఎలా ఉంటుంది? ఎలాంటి కాన్సెప్ట్ ను తీసుకుంటాడు? అంటూ ముందొస్తు చ‌ర్చ షురూ అయింది. ఆదిత్య ధ‌ర్ కి డైరెక్ట‌ర్ గా `ధురంధ‌ర్` రెంవ‌డ చిత్ర‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. స్పై బ్యాక్ డ్రాప్ లో దేశ భ‌క్తి నేప‌థ్యంలో చేసి ఈ రేంజ్ స‌క్సెస్ అందుకున్నాడు. తొలి సినిమా `యూరి` స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కించి బ్లాక్ బస్ట‌ర్ అందుకున్నాడు. తొలి సినిమాతోనే 300 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టాడు. దీంతో ఈ బ్యాక్ డ్రాప్ క‌థ‌ల‌కు ఆదిత్య ఓ బ్రాండ్ గా మారిపోయాడు.

అత‌డు క‌శ్మీరీ పండింట్ కావ‌డంతోనే ఇది సాధ్య‌మైంది. టెర్ర‌రిజం పై అత‌డికి ఉన్న అవ‌గాహ‌న, ప‌రిజ్ఞానం స్పార్క్ రైటింగ్ స్టైల్ అన్న‌ది ఆదిత్య‌కు స‌క్సెస్ ప‌రంగా ఎంతో క‌లిసొచ్చింది. అదే అత‌డిని ఓ గొప్ప డైరెక్ట‌ర్ గా తీర్చి దిద్దింది. మ‌రి `దురంధ‌ర్ 2` త‌ర్వాత ఆదిత్య నుంచి ఎలాంటి సినిమా రాబోతుంది? అంటే అప్పుడే బాలీవుడ్ కొత్త చ‌ర్చ షురూ అయింది. పాకిస్తాన్ దాడిపై ప్ర‌తి చ‌ర్య‌గా భార‌త్ చేప‌ట్టిన `ఆప‌రేష‌న్ సిందూర్` బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసే అవ‌కాశాలున్నాయని బాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కొస్తుంది.

ప్ర‌స్తుతం దేశంలో అది ట్రెడింగ్ టాపిక్ కావ‌డంతో? ఇదే స‌మ‌యంలో ఆప‌రేష‌న్ సిందూర్ ని ట‌చ్ చేస్తే క‌మ‌ర్శియ‌ల్ స‌క్స‌స్ తో పాటు మంచి మైలేజ్ కూడా వ‌స్తుంది అన్న విశ్లేష‌ణ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఆదిత్య ఇమేజ్ ను అంత‌కంత‌కు రెట్టింపు చేసే కాన్సెప్ట్ ఇద‌ని అంటున్నారు. మ‌రి ఆదిత్య‌ధ‌ర్ మైండ్ లో ఏముందో చూడాలి. మార్చి 19న రిలీజ్ అయ్యే `ధురంధ‌ర్ 2` అనంత‌రం తదుప‌రి చిత్రంపై క్లారిటీ వ‌స్తుంది.

Tags:    

Similar News