బాలీవుడ్‌పై విరుచుకుప‌డిన సీరియ‌ల్ కిస్స‌ర్‌!

ఈ నేప‌థ్యంలోనే బాలీవుడ్ సీరియ‌ల్ కిస్స‌ర్ ఇమ్రాన్ హ‌ష్మీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `ధురంధ‌ర్ 2`, ర‌ణ్‌వీర్ సింగ్ సాధించిన విజ‌యాన్ని ఇండైరెక్ట్‌గా ప్ర‌శంసిస్తూ బాలీవుడ్‌పై విరుచుకుప‌డ్డారు.;

Update: 2026-05-02 15:30 GMT

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయకుడిగా న‌టించిన భారీ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధురంధ‌ర్ 2`. ఆదిత్య‌ధ‌ర్ అత్యంత సాహ‌సోపేతంగా దీన్ని తెర‌కెక్కించారు. మార్చి 19న విడుద‌లైన ఈ భారీ స్పై డ్రామా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించింది. ఇండియాపై పాక్ ప‌న్నిన కుట్ర‌లు, కుతంత్రాలు, ఆ కుట్ర‌ల్ని పాక్‌లోనే ఉంటూ స్పైగా ప‌ని చేసి ప్రాణాల‌కు సైతం తెగించి పాక్ కుట్ర‌ల‌ని భ‌గ్నం చేసిన ఎంతో మంది వీర జ‌వానుల స్ఫూర్తి వంత‌మైన రియ‌ల్ స్టోరీస్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల్ని తిర‌గ‌రాసింది.

సినిమా విడుద‌లై 40 రోజుల‌కు పైనే అవుతున్నా ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతూ క్రేజీ రికార్డుల్ని స‌మం చేస్తోంది. త్వ‌ర‌లోనే జ‌పాన్‌లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1838 కోట్ల‌కు పైనే రాబ‌ట్టి ప‌లు రికార్డుల్ని తిర‌గ‌రాసింది. త్వ‌ర‌లో జ‌పాన్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా `దంగ‌ల్‌` రికార్డుల్ని తుడిచి పెట్టేయ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌పై బాలీవుడ్ సీరియ‌ల్ కిస్స‌ర్ ఇమ్రాన్ హ‌ష్మీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

`ధురంధ‌ర్ 2` రిలీజ్ త‌రువాత సినిమాపై ద‌క్షిణాదికి చెందిన ప‌లువురు క్రేజీ స్టార్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్‌, హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌ని ఆకాశానికి ఎత్తేసి అభినంద‌న‌ల వ‌ర్షం కురిపించారు. బాలీవుడ‌కు చెందిన కొంత మంది మాత్ర‌మే స్పందించ‌గా..చాలా వ‌ర‌కు బాలీవుడ్ దిగ్గ‌జాలు దీనిపై స్పందించ‌లేదు. దీంతో నెట్టింట బాలీవుడ్ సెల‌బ్రీటీల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిసింది.

ఈ నేప‌థ్యంలోనే బాలీవుడ్ సీరియ‌ల్ కిస్స‌ర్ ఇమ్రాన్ హ‌ష్మీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `ధురంధ‌ర్ 2`, ర‌ణ్‌వీర్ సింగ్ సాధించిన విజ‌యాన్ని ఇండైరెక్ట్‌గా ప్ర‌శంసిస్తూ బాలీవుడ్‌పై విరుచుకుప‌డ్డారు. బాలీవుడ్ ఒక‌రి స‌క్సెస్‌ని ఒప్పుకోలేద‌ని, కొంత మంది స‌క్సెస్‌ని ఇక్క‌డ జీర్ణించుకోలేర‌ని ఇండైరెక్ట్‌గా `ధురంధ‌ర్ 2`తో పాటు ర‌ణ్‌వీర్ సింగ్ స‌క్సెస్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

అంతే కాకుండా బాలీవుడ్‌లో ఉన్న వాళ్ల‌లో కొంత మంది స‌క్సెస్ అవుతున్నారంటూ హ్యాపీగా ఉండ‌లేర‌ని చుర‌క‌లించించారు. ఇదే సంద‌ర్భంగా సౌత్ మేక‌ర్స్‌, హీరోల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. సౌత్ ఇండ‌స్ట్రీలో తాను రెండు సినిమాలు చేశాన‌ని, వాళ్లు చాలా మంచి వ్య‌క్తుల‌న్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, స‌హాక‌రించే గుణం ఉన్న‌వార‌ని తెలిపారు. అంతే కాకుండా ఒక‌రి స‌క్సెస్‌ని ఒక‌రు స‌పోర్ట్ చేస్తూ ఆరోగ్య‌క‌రంగా ఉంటార‌ని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Tags:    

Similar News