నెక్స్ట్ మూవీ.. ధనుష్ డెసిషన్ కు రీజనేంటి?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి తన ప్లాన్ తో వార్తల్లో నిలిచారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా ఆకట్టుకుంటున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి తన ప్లాన్ తో వార్తల్లో నిలిచారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా ఆకట్టుకుంటున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం కోలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ప్రకటించిన ఓ ప్రాజెక్టును మరో నిర్మాణ సంస్థ నుంచి తన సొంత బ్యానర్ కు మార్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కొన్ని నెలల క్రితం దర్శకుడు తమిళరసన్ పచ్చ ముత్తుతో కలిసి ధనుష్ కొత్త సినిమా చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. లబ్బర్ పండు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళరసన్.. ధనుష్ కెరీర్ లో 57వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటన వెలువడింది. దీంతో ఆ ప్రాజెక్టుపై అభిమానుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ సినిమాను మొదట డాన్ పిక్చర్స్ నిర్మించాల్సి ఉంది. హీరోయిన్ గా రుక్మిణి వసంత్, నటుడు విజయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. కథకు తగ్గట్టు పలు ప్రాంతాల్లో లొకేషన్ రికీ కూడా నిర్వహించినట్లు రీసెంట్ గా మూవీ టీమ్ తెలిపింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని అందరూ భావించారు.
అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందాల్సిన కొన్ని సినిమాలు వివిధ కారణాలతో ఆలస్యం అవుతున్నాయని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ధనుష్-తమిళరసన్ సినిమా కూడా అదే పరిస్థితి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ధనుష్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సినిమా నిర్మాణ బాధ్యతలను తన సొంత సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్ కు మార్చినట్లు సమాచారం. ప్రాజెక్ట్ లేట్ కాకుండా, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ధనుష్ కెరీర్ ను పరిశీలిస్తే.. కథల సెలక్షన్ లో ఆయన ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు కెరీర్ లో పలు కమర్షియల్ సినిమాలు కూడా చేసినప్పటికీ, స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న కథలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకే తమిళరసన్ చెప్పిన కథపై ఆయనకు పూర్తి నమ్మకం ఉందని, ప్రాజెక్టు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో నిర్మాణ సంస్థను మార్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా ప్రస్తుతం ధనుష్ చేతిలో అనేక ప్రాజెక్టులు ఉండటంతో, ఒక మూవీ లేట్ అయితే ఆ ఎఫెక్ట్ ఆయన ప్లానింగ్ పై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే తమిళరసన్ పచ్చ ముత్తుతో చేస్తున్న ప్రాజెక్టుపై ధనుష్ కు ఉన్న నమ్మకమే ఆయన నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉన్నప్పటికీ.. సినిమా త్వరలోనే కొత్త జోష్ తో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.