చాహల్ తో రూ.60 కోట్ల భరణం డిమాండ్..ధనశ్రీ క్లారిటీ!
ఇండియన్ క్రికెట్ ప్లేయర్ చాహల్, నటి ధనశ్రీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.;
ఇండియన్ క్రికెట్ ప్లేయర్ చాహల్, నటి ధనశ్రీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరికి పరిచయం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులు డేటింగ్ చేసి 2020లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ప్రతి ఒక్క సెలబ్రిటీ విషయంలో ఏవో కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలా విడాకులకు కారణం వారు వేరే వాళ్ళతో ఎఫైర్ లు పెట్టుకోవడం అని కొంతమంది ప్రచారం చేస్తే.. మరికొంత మందేమో విడాకులయ్యాక ఆ సెలబ్రిటీ నుండి ఆయన భార్య కొన్ని కోట్ల రూపాయలను భరణం కింద డిమాండ్ చేసింది అంటూ ప్రచారం కూడా జరిగింది.
అయితే ధనశ్రీ,చాహల్ లు విడిపోయాక కూడా వీరి మధ్య ఈ ప్రచారం జరిగింది. ముఖ్యంగా ధనశ్రీకి వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందని, అందుకే చాహల్ ఆమెను వదిలేసాడని కొంతమంది ప్రచారం చేస్తే.. మరికొంతమందేమో చాహల్ కి వేరే అమ్మాయితో రిలేషన్ ఉందని,అందుకే ధన శ్రీ అతన్ని వదిలించుకుందని ఇంకొంత మంది ప్రచారం చేశారు. ఇక వీరిద్దరి రిలేషన్ కి సంబంధించిన పుకార్లు మాత్రమే కాకుండా ధనశ్రీ , చాహల్ నుండి విడాకులు పొందాక దాదాపు రూ.60 కోట్ల భరణాన్ని డిమాండ్ చేసినట్టు కూడా రూమర్స్ వినిపించాయి.అయితే తాజాగా 60 కోట్ల భరణం గురించి ధనశ్రీ స్పందిస్తూ ఈ రూమర్లను కొట్టి పారేసింది. ధనశ్రీ ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ అనే రియాల్టీ షోలో పోటీ పడుతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా తనపై వచ్చిన 60 కోట్ల భరణం వార్తల గురించి స్పందిస్తూ.."నేను చాహల్ తో విడిపోయినప్పటికీ ఇప్పటికి ఆయన్ని గౌరవిస్తూనే ఉన్నాను. అలాగే నేను 60 కోట్ల భరణం తీసుకున్నాను అని వచ్చిన వార్తలన్నీ అవాస్తవమే. ఎందుకంటే మేమిద్దరం పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకున్నాం.పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటే భరణం అనేది ఉండదు.. పరస్పర అంగీకారంతో విడిపోయాం కాబట్టి మాకు డివోర్స్ తొందరగా వచ్చాయి. కానీ ఇందులో కూడా రూమర్లు సృష్టించడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు.
నేను మా విడాకుల గురించి ఎన్ని రూమర్లు వినిపించినా కూడా మౌనం పాటించడం కారణంగా హద్దులు మీరి పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. మన గురించి ఏమీ తెలియకుండా రూమర్లు పుట్టించే వారికి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనే సంగతి ముందుగా తెలుసుకోవాలి.కానీ నాపై వచ్చిన ఈ భరణం వార్తలని చూసి చాలా బాధపడ్డాను. ఇలాంటి వార్తలు ఎవరు క్రియేట్ చేస్తారో కానీ వాటి వల్ల చాలా సఫర్ అయ్యాను" అంటూ 60 కోట్ల భరణం తీసుకుంది అనే వార్తలపై ధనశ్రీ తాజాగా క్లారిటీ ఇచ్చేసింది.