వారణాసి లీక్స్... డీకోడ్ చేస్తే..

రాజమౌళి ఇప్పటివరకు చేసిన ప్రయోగాలన్నింటినీ కలిపి ఒకే సినిమాగా మలిస్తే అదే 'వారణాసి' అనిపిస్తోంది.;

Update: 2025-12-07 08:30 GMT

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ అనగానే అంచనాలు మామూలుగా ఉండవు. అయితే ఇప్పుడు 'వారణాసి' సినిమాపై దర్శకుడు దేవా కట్టా చేసిన వ్యాఖ్యలు ఆ అంచనాలను పీక్స్ కు తీసుకెళ్లాయి. కథ వినగానే తన మైండ్ బ్లాక్ అయ్యిందని, ఇది మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను మించిన షాక్ ఇస్తుందని ఆయన చెప్పడం వెనుక పెద్ద లాజిక్ ఉన్నట్టే కనిపిస్తోంది. జక్కన్న తన కెరీర్ లోని బెస్ట్ ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి ఈ సినిమా కోసం ఒక భారీ స్కెచ్ వేసినట్లు అర్థమవుతోంది.

దేవా కట్టా ప్రస్తావించిన సినిమాలను డీకోడ్ చేస్తే.. మగధీర, ఈగ రెండూ బలమైన ఎమోషన్స్, కాలంతో ముడిపడి ఉన్న కథలు. 'వారణాసి' గ్లింప్స్ లో 512 CE, 2027 CE అని చూపించడాన్ని బట్టి చూస్తే, రాజమౌళి మరోసారి తనకు ఇష్టమైన 'కాలం, కర్మ' సిద్ధాంతాన్ని టచ్ చేయబోతున్నారనిపిస్తోంది. గత జన్మల తాలూకు జ్ఞాపకాలు లేదా శతాబ్దాల నాటి ఒక మిస్టరీని ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ కు లింక్ చేసే అవకాశం బలంగా ఉంది.

ఇక బాహుబలి విషయానికి వస్తే, అది స్కేల్ కు, యుద్ధానికి కేరాఫ్ అడ్రస్. వారణాసిలో 'లంకా', 'త్రేతాయుగం' వంటి రిఫరెన్సులు ఉన్నాయంటే, ఇందులో కూడా బాహుబలి రేంజ్ లో ఒక భారీ యుద్ధం లేదా మైథలాజికల్ వార్ ఎపిసోడ్ ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఈసారి కత్తులు, కటార్లతో కాకుండా.. మోడరన్ టెక్నాలజీకి, పురాతన శక్తికి మధ్య జరిగే పోరాటంగా దీన్ని మలిచే అవకాశం ఉంది.

ఆర్ఆర్ఆర్ లో ఇద్దరు హీరోల మధ్య ఎమోషన్ ఎలాగైతే హైలైట్ అయ్యిందో, ఇందులో మహేష్ పాత్ర 'రుద్ర' జర్నీలో కూడా అంతటి ఎమోషన్ ఉంటుందని దేవా కట్టా మాటల ద్వారా తెలుస్తోంది. "లాజిక్స్ ను డామినేట్ చేసే ఎమోషన్స్" అని ఆయన స్పెసిఫిక్ గా చెప్పారంటే, ఇది కేవలం విజువల్ వండర్ మాత్రమే కాదు, గుండెను తాకే ఒక బలమైన భావోద్వేగభరితమైన కథ అని స్పష్టమవుతోంది.

రాజమౌళి ఇప్పటివరకు చేసిన ప్రయోగాలన్నింటినీ కలిపి ఒకే సినిమాగా మలిస్తే అదే 'వారణాసి' అనిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, మైథాలజీ.. ఇలా అన్ని జానర్లను మిక్స్ చేసి ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ ను రెడీ చేశారు. మహేష్ ను గ్లోబల్ ట్రాటర్ గా చూపిస్తూనే, మన ఇతిహాసాల లోతును ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నంలా ఇది కనిపిస్తోంది.

కట్టా ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తుంటే, రాజమౌళి ఏ ఒక్క జానర్ కు పరిమితం కాకుండా, సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నారనిపిస్తోంది. మహేష్ బాబును పాన్ వరల్డ్ స్టార్ గా నిలబెట్టడానికి కావాల్సిన దినుసులన్నీ స్క్రిప్ట్ లో గట్టిగానే దట్టించారు. 2027లో ఈ సినిమా స్క్రీన్ మీద పడితే, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ మరోసారి మారడం ఖాయం.

Tags:    

Similar News