దీవాన 'తెల్ల పోరి'.. ఫన్నీ ఫన్నీగా ఉందే..
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటిస్తున్న లేటెస్ట్ మూవీ దీవాన ప్రస్తుతం యూత్ ఆడియెన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటిస్తున్న లేటెస్ట్ మూవీ దీవాన ప్రస్తుతం యూత్ ఆడియెన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్, మొదటి సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ రాగా.. సినిమా నుంచి తాజాగా వచ్చిన రెండో సింగిల్ తెల్లపోరి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. సరదా లిరిక్స్, ఫన్నీ ప్రెజెంటేషన్ తో ఆ పాట యూత్ ను బాగా ఎంటర్టైన్ చేస్తోంది.
శుభం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న ఆ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ గా స్మేహ మణిమేగలై పరిచయం అవుతున్నారు. వన్ సైడ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది.
ఇప్పటికే ఇది ప్రేమా.. ఇది ప్రేమా.. అనే మెలోడీ సాంగ్ తో మంచి రెస్పాన్స్ అందుకున్న దీవాన టీమ్, ఇప్పుడు పూర్తి భిన్నమైన మూడ్ లో తెల్లపోరి పాటను విడుదల చేసింది. ఆ పాటకు సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ మ్యూజిక్ అందించడంతో పాటు స్వయంగా లిరిక్స్ రాసి పాడారు కూడా. ది క్రింజ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనే ట్యాగ్ తో విడుదల చేసిన ఆ సాంగ్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.
'తెల్లపోరి.. నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది', 'మెత్తమెత్త బుగ్గలు.. పందిపిల్ల పెదవులు' వంటి ఫన్నీ లైన్స్‌తో సాగిన ఆ పాటలో యూత్ మాట్లాడుకునే ఫన్నీ లాంగ్వేజ్ ను యూజ్ చేశారు. ప్రేమలో పడిన ఓ యువకుడు తనకు నచ్చిన అమ్మాయి గురించి ఓవర్ ఎగ్జైట్మెంట్ తో చెప్పుకునే ఫీలింగ్స్ కామెడీ టచ్ తో చూపించారు. 'బ్రష్ చేస్తున్నా.. ఫ్లష్ చేస్తున్నా.. ఆ పిల్ల మొహం తిరుగుతుంటది' వంటి లైన్స్ వినిపించే టైమ్ లో థియేటర్లలో యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రింజ్ కంటెంట్, ఫన్నీ రీల్స్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో తెల్లపోరి సాంగ్ అదే జానర్ లో యూత్ ను టార్గెట్ చేస్తూ రూపొందించినట్టు తెలుస్తోంది. పాటలోని లిరిక్స్, మ్యూజిక్, విజువల్స్ అన్నీ కలిసి ఓ ఫన్ వైబ్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యేలా చేసిన టీజింగ్ స్టైల్ కంపోజిషన్ సాంగ్ కు మెయిన్ అట్రాక్షన్ గా మారింది.
ఇక దీవాన సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టీజర్, పోస్టర్స్, సాంగ్స్ అన్నీ యూత్ ఫుల్ ఎనర్జీతో ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. వన్ సైడ్ లవ్ లో ఉండే మ్యాడ్ నెస్ ను కామెడీ, ఎమోషన్ మిక్స్ చేస్తూ చూపించబోతున్నారని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం తెల్లపోరి పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండగా.. సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.