దంపతుల లంచ్ డేట్: దోశ రుచుల్లో దీపికా-రణ్‌వీర్ సందడి!

ఆ సమయంలో తీసిన ఓ సెల్ఫీని రెస్టారెంట్ యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకోగా అందులో రణ్‌వీర్ తండ్రి జగ్జీత్ సింగ్ భవనాని కూడా కనిపించడం విశేషం.

Update: 2026-07-15 11:35 GMT

బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకోన్ - రణ్‌వీర్ సింగ్ రెండ‌వ సారి తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో త‌మ వ్యక్తిగత సమయాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో మంగళవారం రోజున ముంబైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. వీరికి సంబంధించిన ఫోటోలు ..వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెస్టారెంట్ వద్ద జంట చాలా సాదాసీదాగా, సౌకర్యవంతమైన దుస్తుల్లో కనిపించారు. దీపికా రిలాక్స్‌డ్ కో-ఆర్డ్ సెట్‌లో ఉండగా.. రణ్‌వీర్ సాధారణ టీ-షర్ట్ , నల్లటి ప్యాంట్‌లో స్టైలిష్‌గా కనిపించారు.

ఈ క్యూట్ దంపతులు లంచ్ డేట్‌లో భాగంగా బెన్నె దోశలను రుచి చూశారు. ఈ విహారంలో వారి భద్రతా సిబ్బంది కూడా వెంట ఉన్నారు. రెస్టారెంట్ నుండి బయటకు వస్తున్న సమయంలో తమ ప్రైవసీని గౌరవించాల్సిందిగా భద్రతా సిబ్బంది అక్కడ ఉన్న వారిని కోరారు. ఇద్దరూ మాస్క్‌లు ధరించి తక్కువ ప్రొఫైల్‌లో ఉండటానికి ప్రయత్నించినప్పటికీ అభిమానుల కళ్ల నుండి తప్పించుకోలేకపోయారు. ఇదే రెస్టారెంట్‌కు వీరు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రణ్‌వీర్ నటించిన 'ధురంధర్ 2' సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఇదే చోటుకు వచ్చారు.

ఆ సమయంలో తీసిన ఓ సెల్ఫీని రెస్టారెంట్ యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకోగా అందులో రణ్‌వీర్ తండ్రి జగ్జీత్ సింగ్ భవనాని కూడా కనిపించడం విశేషం. దీపికా - రణ్‌వీర్ తమ రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ఈ ఏడాది ఆరంభంలో సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. తమ మొదటి సంతానం దువా పదుకోన్ సింగ్ అని.. ఇప్పుడు కుటుంబం మరో సభ్యుడు లేదా స‌భ్యురాలిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018లో వివాహం చేసుకున్న ఈ జంట అప్పటి నుండి అన్యోన్యంగా ఉంటున్నారు. ప‌రిశ్ర‌మ‌లోనే ఆద‌ర్శ దంప‌తులుగా వెలిగిపోతున్నారు.

వృత్తిపరంగా చూస్తే దీపికా ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో 'కింగ్' ..అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో 'రాకా' చిత్రాల్లో నటిస్తోంది. రణ్‌వీర్ సింగ్ ఇటీవల 'ధురంధర్ ది రివెంజ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వ్యక్తిగత జీవితం .. వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతుల్యత పాటిస్తూ ఈ జంట అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 'ధురంధ‌ర్' భారీ విజ‌యం నేప‌థ్యంలో ర‌ణ‌వీర్ సింగ్ త‌దుప‌రి ఎలాంటి జోన‌ర్లో సినిమా చేస్తాడు? ఏ ద‌ర్శ‌కుడితో ప‌ని చేస్తాడు? అన్న‌ది అంతే ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News