దీపికా పదుకొణే తీరు అక్కడా అంతేనా!
తనవైపు నుంచి తాను చెప్పాలనుకున్నది ప్రత్యక్షంగానో..పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ వేళ్లన్నీ తప్పంతా దీపిక వైపే చూపిస్తున్నాయి.;
దీపికా పదుకొణే ఇప్పుడు సంచలనంగా మారిన పేరు. `స్పిరిట్` చిత్రానికి నో చెప్పడం..అటుపై `కల్కి 2` నుంచి నిర్మాణ సంస్థ తొలగించడంతో? నెట్టింట టార్గెట్ అయింది. ఎలాంటి కారణాలతో అవకాశాల్ని వదులుకుంది? అన్నది పక్కన బెడితే? ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తున్నారు. ఈ విషయంలో దీపిక కూడా ఎంత మాత్రం తగ్గలేదు. తనవైపు నుంచి తాను చెప్పాలనుకున్నది ప్రత్యక్షంగానో..పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ వేళ్లన్నీ తప్పంతా దీపిక వైపే చూపిస్తున్నాయి. ఇదంతా టాలీవుడ్కి సంబంధించిన ఎపిసోడ్. తన భాష కాదు.
ఆ స్థానంలో కృతి సనన్:
తాను లాంచ్ అయిన పరిశ్రమ కాదు కాబట్టి అలా అనుకోవచ్చు. మరి బాలీవుడ్ లోనూ అమ్మడు ఇదే తీరుతో ఉందా? అంటే అవుననే ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఓ ప్రాజెక్ట్ విషయంలో దీపిక తెలుగు సినిమాలను రిజెక్ట్ చేసినట్లే హిందీ చిత్రాన్ని రిజెక్ట్ చేసిందన్న వార్త వెలుగుకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. `కాక్ టెయిల్` కి సీక్వెల్ గా `కాక్ టెయిల్ 2`ని ప్రకటించిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, అమితాబచ్చన్, సంజయ్ దత్ , రష్మికా మందన్నా, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో మాతృకను తెరకెక్కించిన హోమీ అడజానియా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో కృతిసనన్ ఎంపికైన పాత్రకు తొలుత దీపికనే హోమీ అడిగారుట.
అంతా కొత్త వారైనా అవకాశం:
మాతృకలో నటించింది దీపిక కావడంతో అదే పాత్రను ఆమెతో కొనసాగిస్తే బాగుంటందని భావించి దీపిక ముందుకెళ్లారుట. కానీ ఆ పాత్ర తానిప్పుడు చేయలేనని సున్నితంగా తిరస్కరించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి పార్ట్ 2 లో నటీనటులంతా కొత్త వారే. మొదటి భాగంలో నటించిన వారెవ్వరు లేరు. కానీ దిపక రోల్ ఒక్కటే కంటున్యూ చేయాలనే ఆలోచనతో ఆమె దగ్గరకెళ్తే తిరస్కరణ ఎదురైంది. మొదటి భాగంలో దీపిక వెరోనికా మిలానే పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ పాత్రలో అమ్మడు ఒదిగిపోయింది. ఆద్యంతం ఆకట్టుకుంది.
రెండు సినిమాలతో బిజీ:
అయితే దీపిక రిజెక్షన్ వెనుక మరో కారణం కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాకు గాను అమ్మడు పారి తోషికం ఎక్కువగా అడిగిందని...కానీ తాను డిమాండ్ చేసినంత ఇవ్వలేనని దర్శకుడు చెప్పడంతో? స్కిప్ కొట్టిందన్నది మరో ప్రచారం. మరి ఇందులో నిజా నిజాలు బయటకు వస్తే గానీ క్లారిటీ రాదు. ప్రస్తుతం దీపికా పదుకొ బన్నీ22 వ చిత్రంలో మెయిన్ లీడ్ పోషిస్తోంది. దీంతో పాటు బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటిస్తోన్న `కింగ్` చిత్రంలోనూ నటిస్తోంది.