దీపిక టాలీవుడ్ ఎంట్రీ ఆలస్యం కూడా అమృతమే!
బాలీవుడ్ నటి దీపికా పదుకొణే 'కల్కి 2898' చిత్రంతో టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.;
బాలీవుడ్ నటి దీపికా పదుకొణే 'కల్కి 2898' చిత్రంతో టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. గర్భవతి సుమతి పాత్రలో దీపిక అలరించింది. తెరపై ఆ పాత్ర కనిపించింది కాసేపే అయినా ఎంతో ఎగ్జైట్ మెంట్ కు గురిచేసిన రోల్ అది. కల్కి రెండవ భాగంలో కథ అంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అలా దీపిక తెలుగు ఆడియన్స్ కు సుపరిచితురాలిగా మారిపోయింది. ప్రస్తుతం బన్నీ 22వ చిత్రంలో కూడా తానే హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. దీపిక ఇమేజ్ కి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.
ఆమె నటలించాలేగానీ కోట్ల పారితోషికం ఆఫర్ చేయడానికి నిర్మాతలంతా సిద్దంగా ఉన్నారు. ఇదంతా ఇప్పుడు. అసలు దీపిక తెలుగు తెరకు పరిచయం కావాల్సింది కల్కి తో కాదు. కొన్ని దశాబ్ధాల క్రితమే అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపికా పదుకొణే కన్నడ చిత్రం 'ఐశ్వర్య'తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగులో మన్మధుడు సినిమాకు రీమేక్ రూపం అంది. అయితే అదే సమయంలో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెలుగులో ఓ సినిమా తె రకెక్కింది.
అందులో ఓ పాటలో దీపికా పదుకొణే డాన్స్ చేసిందన్న విషయం ఇప్పుడే తెలిసింది. ఈ విషయం దీపిక స్వయంగా తెలిపింది. అయితే అప్పట్లో ఆ సినిమా రిలీజ్ కాకపోవడంతో కల్కి సినిమానే దీపికా పదుకొణే టాలీవుడ్ ఎంట్రీ చిత్రమైందని తెలిపింది. లేదంటే దశాబ్ధాల క్రితమే దీపిక టాలీవుడ్ లో కనిపించేది. కొన్ని సార్లు ఆలస్యమైనా అద్భుతాలు జరుగుతాయి అనడానికి దీపిక ఓ ఉదాహరణ.
అప్పుడే దీపిక లాంచ్ అయి ఉంటే? ఆ సినిమా ఎలా ఉండేదో తెలిసేది కాదు. కల్కి తో పాన్ ఇండియాలో భారీ ఎత్తున లాంచ్ అయింది. తెలుగులో ఆమెకు ఓ గొప్ప అనుభూతిని ఈ సినిమా అందించింది. అప్పు డు లక్షల్లో పారితోషికం తీసుకుని ఉండేది. కానీ నేడు కోట్లలో అందుకుంటోంది. అందుకే ఒక్కోసారి ఆలస్యం కూడా అమృతం అవుతుంది.