డేవిడ్ వార్నర్‌కు రాజమౌళి సర్ ప్రైజ్
ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసింది.;
ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసింది. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా తదితరులు నటించిన ఈ విజువల్ వండర్ ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం అందుకుంటోంది. విడుదలై దశాబ్దం అయినా, బాహుబలి క్రేజ్ తగ్గడం లేదు. తాజాగా ఈ సినిమా సంబంధించి ఆసక్తికర విషయం మరోసారి వైరల్ అయింది.
మరోసారి బాహుబలి - ది ఎపిక్
రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి ఈసారి “బాహుబలి: ది ఎపిక్” పేరుతో ఒకే భాగంగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మళ్లీ తెరపై సందడి చేయనుంది. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. డేవిడ్ వార్నర్ లాంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు బాహుబలి మానియా లో భాగం కావడం విశేషం.
వార్నర్ - బాహుబలి క్రేజ్
ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి భారతీయ సినిమాలపై ప్రత్యేక అభిమానం ఉంది. ముఖ్యంగా తెలుగు సినిమాల పాటలకు స్టెప్పులు వేయడంలో, మాస్ డైలాగ్స్ ను డబ్ చేయడంలో ముందు వరుసలో ఉంటారు. వార్నర్ చేసిన బాహుబలి వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అతని ఫన్ అటిట్యూడ్, ఫ్యాన్స్‌తో కలిసిపోయే స్వభావం ఇండియన్ సినీప్రియుల్లోనూ ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇటీవల బాహుబలి విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, తన ఇన్‌స్టాగ్రామ్‌లో మాహిష్మతి రాజుగా ఉన్న లుక్స్ పిక్స్‌ను షేర్ చేస్తూ, ‘కిరీటం ఉన్న ఫొటో బాగుందా?’ అంటూ ముచ్చటించారు.
రాజమౌళి గిఫ్ట్ - మాహిష్మతి కిరీటంతో వార్నర్
వార్నర్ పోస్టుకు దర్శకుడు రాజమౌళి రిప్లై ఇచ్చారు. ‘‘హాయ్ డేవిడ్.. మీరు ఇప్పుడు మాహిష్మతి సామ్రాజ్యానికి నిజమైన రాజులా తయారవ్వండి. ఈ కిరీటాన్ని మీకోసం పంపిస్తున్నా’’ అని రాజమౌళి సర్‌ప్రైజ్ చేశారు. ఇందుకు వార్నర్ కూడా ఆనందంతో స్పందిస్తూ, ఆ గిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్నానన్నారు. అంతేకాదు, ‘‘మీరు ఆస్ట్రేలియాలో ఈ సినిమాను మరోసారి చూడండి’’ అంటూ బాహుబలి టీమ్ కూడా స్పెషల్ మెసేజ్ పెట్టింది. ఈ మజిలీలో వార్నర్ సరదాగా ‘ఓకే’ అని థంబ్ ఎమోజీ పెట్టారు. క్రికెటర్‌కే కాదు, అభిమానులకు కూడా ఇది ప్రత్యేక అనుభూతిగా మారింది.
తారాగణం, టీమ్, ప్రేక్షకుల ఆనందం
బాహుబలి చిత్రానికి రాజమౌళి దర్శకత్వం, కే. రాఘవేంద్ర రావు సమర్పణ, శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మాణం ఇలా అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రతిభ ఒడిసిపట్టి నిలిచాయి. సినిమాను చూసిన ప్రతి ఒక్కరికీ కొత్త అనుభూతి కలిగించడంలో ఈ టీమ్ విజయవంతమైంది. డేవిడ్ వార్నర్ లాంటి ఆటగాడు భారతీయ సంస్కృతిని, సినిమాను ఇంతగా అభిమానించడం అతడి స్పందన, అభిమానులు ఆనందపడేలా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం, ఇవన్నీ బాహుబలి ఫ్యాన్సీకి కొత్తగా జతయ్యాయి.