• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దసరా టికెట్ రేట్లు.....

దసరా టికెట్ రేట్లు.. లియోకి అంత డిమాండా?

| ఈ మూడు చిత్రాల కోసం అటు అభిమానులు ఇటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వీటి టికెట్ ధరల వివరాలు బయటకు వచ్చాయి.

By - Tupaki Desk
Update: 2023-10-13 07:43 GMT

తెలుగు సినీ పరిశ్రమలో పండగ సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల జోరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దసరా పండగ రాబోతుంది. ఈ పండగ బరిలో ఏకంగా ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుండగా... తెలుగు బాక్సాఫీస్ ముందు మూడింటి మధ్య గట్టి పోటీ నెలకొంది. అవే బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, దళపతి విజయ్ లియో.

ఈ మూడు చిత్రాల కోసం అటు అభిమానులు ఇటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వీటి టికెట్ ధరల వివరాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్ నగరంలోని మల్టీప్లెక్స్​, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ చిత్రాల టికెట్లను ఎంతకు విక్రయిస్తున్నారో తెలిసింది. అయితే ఇక్కడ డబ్బింగ్ సినిమా అయిన లియోకు భారీగా రేట్లు ఉండటం గమనార్హం.

అవును మీరు చదివింది నిజమే. భగవంత్ కేసరికి మల్టీప్లెక్స్​లో రూ. 250, సింగిల్ స్క్రీన్​లో రూ.175 ఉండగా.. టైగర్ నాగేశ్వరరావుకు మల్టీప్లెక్స్​లో రూ.200, సింగిల్ స్క్రీన్​లో రూ.150గా ఉందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ లియో మాత్రం ఏకంగా మల్టీప్లెక్స్​లో రూ. 295, సింగిల్ స్క్రీన్​లో రూ.175గా చూపించడం ఆసక్తికరంగా ఉంది. ఓ డబ్బింగ్​ చిత్రంకు సొంత భాషల చిత్రాల కన్నా ఎక్కువగా విక్రయించడం అంటే ప్రస్తుతం దాని క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతోంది.

మరి ఈ టికెట్ ధరల్లో మార్పులు, చేర్పులు కూడా ఉండే అవకాశాలు చాలా వరకు ఉండొచ్చు. త్వరలోనే ఈ మూవీ టికెట్​లు ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఈ సినిమాల టికెట్ ధరలు ఏ రేంజ్​లో ఉండబోతున్నాయి మరింత క్లారిటీ వస్తుంది. చూడాలి మరి ఈ సినిమాలు ఎంత వరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయో.. వీటిలో ఏది పై చేయి సాధిస్తుందో అనేది.

ఇకపోతే భగవంత్ కేసరి మాస్ ఎంటర్​టైనర్​ ఫాదర్ అండ్ డాటర్​ నేపథ్యంలో రానుండగా.. టైగర్ నాగేశ్వరరావు ఓ గజదొంగ బయోపిక్​గా వస్తోంది. లియో... గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కింది.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Movies 
  • Release 
  • Tigernageswararao 
  • Bhagavanthkesari 
  • Leo 
  • Leomovie 
  • Ticketrates 
  • Highdemand 
  • Multiplex 
  • Singlescreen 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS