అమ్మాయిని మోసం చేసిన బడా నిర్మాత.. ఎవరతను..?
సినిమా అనే రంగుల ప్రపంచంలో బయటకు కనిపించేది రిలీజ్ లు, సక్సెస్ లు మాత్రమే కానీ లోపల ఒక భయంకరమైన ప్రపంచం ఉంటుంది.;
సినిమా అనే రంగుల ప్రపంచంలో బయటకు కనిపించేది రిలీజ్ లు, సక్సెస్ లు మాత్రమే కానీ లోపల ఒక భయంకరమైన ప్రపంచం ఉంటుంది. అక్కడ అవకాశాల కోసం వెతికే ప్రయత్నంలో అవకాశాలు ఇచ్చే వారు ఏం చెబితే అది చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొందరు దర్శక నిర్మాతలు చెప్పింది మేమెందుకు చేయాలని ఆగిపోతే.. మరికొందరు మాత్రం ఎలాగైనా ఛాన్స్ లు కావాలని మోసపోతుంటారు. లేటెస్ట్ గా ఇలాంటి ఒక విషయాన్ని తెలంగాణా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద వెల్లడించారు.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరళ్ల శారద...
తెలంగాణా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మహిళలకు అండగా ఉంటున్నారు నేరళ్ల శారద. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన దగ్గరకు ఇండస్ట్రీకు సంబంధించిన కేసులు చాలా వస్తున్నాయని చెప్పారు. రీసెంట్ గా ఒక అమ్మాయిని మోసం చేసిన నిర్మాత గురించి ఆ అమ్మాయి వచ్చి చెప్పిందని అన్నారు. అతనొక పెద్ద నిర్మాత.. ఆల్రెడీ పెళ్లై పిల్లలు ఉన్నారు. అయినా కూడా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో పిల్లల్ని కన్నాడు.
ఆమె మోసపోయిందని తెలుసుకుని తన దగ్గరకు వచ్చి విషయం చెప్పిందని. ఐతే ఇండస్ట్రీలో ఇలాంటివి బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. పేపర్స్ అంతా రెడీ చేసి ఆమెకు న్యాయం చేయాలని తాను చూస్తే.. ఏదో ఒక రీజన్ చెప్పేసి ఆ అమ్మాయి ఆగిపోతుంది. ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయని నేరళ్ల శారద అన్నారు. ఐతే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. నేరెళ్ల శారద ఆ నిర్మాత పేరు బయటకు చెప్పలేదు.
ఇండస్ట్రీలో ఇలాంటి మోసాలు..
ఐతే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ నిర్మాత ఎవరన్నది తెలుసుకోవాలనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇటీవలే పెద్ద హిట్ కొట్టాడని చెప్పగానే అది ఎవరై ఉంటారా అంటూ ఆరా తీస్తున్నారు. ఐతే ఇండస్ట్రీలో ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నా ఏ ఒక్కరు గట్టిగా నిలబడే పరిస్థితి ఉండదు. ఐతే ఇష్యూ పెద్దది కాకుండానే చర్చలతోనే సమస్యకు పరిష్కారం చూస్తుంటారు.
ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక చీకటి కోణం ఉంటూనే ఉంటుంది. ఛాన్స్ ఇస్తా అని చెప్పి మోసం చేసే వాళ్ల సంఖ్య అధికంగా ఉంటుంది. అంతేకాదు స్టార్స్ పేరు చెప్పి కూడా మోసం చేస్తుంటారు. డబ్బులు తీసుకుని సినిమాలు తీయకుండా ఉండటం.. అమ్మాయిలను ఐతే ప్రేమిస్తున్నా సినిమా ఛాన్స్ లు ఇప్పిస్తా అంటూ మోసం చేయడం ఇలాంటివి జరుగుతాయి. వీటిపై ఎన్ని కమిషన్లు పెట్టినా.. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒకచోట ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.