'స్టీవ్ జాబ్స్' బయోపిక్‌లా క్యూరియాసిటీ పెంచే 'ఇంక్'
ఒక సరళమైన కథను, రియల్ కథను అద్భుతమైన స్క్రీన్ ప్లే మాయాజాలంతో చూపించగలిగే పనితనాన్ని దర్శకత్వం అని నిర్వచించవచ్చు.;
ఒక సరళమైన కథను, రియల్ కథను అద్భుతమైన స్క్రీన్ ప్లే మాయాజాలంతో చూపించగలిగే పనితనాన్ని దర్శకత్వం అని నిర్వచించవచ్చు. అలాంటి నిర్వచనం డానీ బోయ్ లేకి వందశాతం సరిపోతుంది. అతడు తెరకెక్కించిన `స్లమ్ డాగ్ మిలియనీర్` దానికి చక్కని ఉదాహరణ. ముంబై మురికివాడలలో జీవించే పిల్లల ధైన్యం- ముష్ఠి మాఫియాను, అమితాబ్ హోస్టింగ్ చేస్తున్న కేబీసీకి ముడిపెట్టి ఈ సినిమాని అద్భుతమైన స్క్రీన్ ప్లేతో మలిచిన తీరు రక్తి కట్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్ దీనిని వోన్ చేసుకుని ప్రశంసించేంతగా తెరపైకి ఒక కథను తెచ్చారు డానీ బోయ్‌లే. దీనికి ఏ.ఆర్.రెహమాన్ లాంటి ట్యాలెంట్ యాడైతే మ్యాజిక్ చేయవచ్చని ప్రూవ్ అయింది.
`స్లమ్ డాగ్ మిలియనీర్` తర్వాత కూడా క్లాసిక్స్ ని ఎన్నిటినో తెరకెక్కించారు డానీ బోయ్‌లే. లేటెస్ట్ మూవీ `28 ఇయర్స్ లేటర్` ఈ కేటగిరీనే. ఈ సినిమా విజయం తర్వాత, డానీ బోయిలే వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక జర్నలిజం డ్రామాను తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. 1960లలో సాగే కథతో రూపొందించనున్న ఈ సినిమాకి `ఇంక్` అనే యూనివర్శల్ అప్పీల్ ఉన్న టైటిల్ ని ఎంచుకున్నాడు. ఇది రూపెర్ట్ ముర్డోక్ మీడియా సామ్రాజ్యం- బ్రిటిష్ వార్తాపత్రిక `ది సన్`ఎడిటర్ లారీ లాంబ్ చుట్టూ తిరిగే నాటకీయ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న సినిమా. ఇందులో మీడియా జర్నలిజంలో గొప్ప హైట్స్ ని చూసిన `ది సన్` ఉత్థానపతనాల చుట్టూ కథ తిరుగుతుంది. `ది సన్`ను రూపర్డ్ మర్ధోక్ (గై పియర్స్ నటిస్తున్నారు) ఎలా స్వాధీనం చేసుకున్నాడు? రూపర్డ్- క్లైర్ ఫోయ్- జాక్ ఓ కానెల్ (ఎడిటర్ లాంబ్ పాత్రధారి) మధ్య కథనం ఎలా సాగిందో తెరపై చూపిస్తున్నారు.
తాజాగా నిర్మాణ సంస్థ ఎడిటర్ లాంబ్ పాత్రధారిగా నటించిన కోనెల్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించింది. హౌస్ ప్రొడక్షన్స్, మీడియా రెస్, డెసిబెల్ ఫిల్మ్స్ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జేమ్స్ గ్రాహం ఈ చిత్రానికి స్క్రిప్టు రాసారు. ఇంక్ - కొత్త రకమైన వార్తల కోసం ఆలోచించే దార్శనికులు, అదే సమయంలో అసమర్థుల గ్రూప్ పోరాటాలకు సంబంధించిన భావోద్వేగా మెలో డ్రామాతో సాగే చిత్రమని దర్శకుడు చెబుతున్నారు.
ఆపిల్ లెజెండ్ బయోపిక్ అయిన `స్టీవ్ జాబ్స్` తరహాలో `ఇంక్` కూడా బయోపిక్ కేటగిరీకే చెందుతుందని ఒక అంచనా. దీని కోసం స్క్రీన్ రైటర్ ఆరోన్ సోర్కిన్ సహకారం తీసుకుంటున్నారు డానీ బోయ్‌లే. స్టీవ్ జాబ్స్ చిత్రానికి పని చేసిన సినిమాటోగ్రాఫర్ ఆల్విన్ హెచ్. కుచ్లర్ `ఇంక్` చిత్రానికి కూడా పని చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది.