హీరో, డైరెక్టర్ విజన్స్ సింక్ అవ్వలేదా? ఇక అంతే సంగతా?

ఇప్పుడు అలాంటి పరిస్థితే ఓ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Update: 2026-06-09 13:30 GMT

ఏ సినిమా అయినా సక్సెస్ అవ్వడానికి స్టోరీ, క్యాస్టింగ్, టెక్నీషియన్స్ టాలెంట్ ఎంత ముఖ్యమో.. హీరో, దర్శకుడి ఆలోచనా విధానం కూడా అంతే కీలకం. ముఖ్యంగా ఇద్దరి విజన్ ఒకేలా ఉంటేనే సినిమా అనుకున్న రేంజ్ లో ముందుకు సాగుతుంది. కానీ అదే విషయంలో డిఫరెన్సెస్ వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కొన్నిసార్లు భారీ అంచనాల మధ్య స్టార్ట్ అయిన ప్రాజెక్టులు కూడా మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఓ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కోలీవుడ్‌ కు చెందిన ఓ స్టార్ హీరో, టాలీవుడ్‌ కు చెందిన ఓ యంగ్ డైరెక్టర్ కాంబినేషన్‌ లో సినిమా తెరకెక్కుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన లేకపోయినా ఆ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రెండు లాంగ్వేజెస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఆ సినిమా రూపొందనుందనే టాక్ కూడా వినిపించింది. దీంతో ఆ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అభిమానులు ఎంతో వెయిట్ చేశారు.

ఇక ఇటీవల సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. కొద్ది రోజుల పాటు షూటింగ్ జరిగినట్లు కూడా తెలుస్తోంది. అయితే రీసెంట్ గా చిత్రీకరణ పూర్తయిన తర్వాత అప్పటికే షూట్ చేసిన సీన్స్ రషెస్‌ ను హీరో చూసినట్లు వినికిడి. అక్కడి నుంచి కథ మలుపు తిరిగిందనే ప్రచారం మొదలైంది. సినిమా ప్రారంభానికి ముందు చెప్పిన స్టోరీ, స్క్రిప్ట్ ఒకలా ఉంటే.. షూట్ చేసిన సీన్స్ మరోలా కనిపించాయని హీరో భావించారట.

అంతే కాదు.. తాను ఊహించిన విధంగా అవుట్‌ పుట్ లేదనే అభిప్రాయాన్ని దర్శకుడితో షేర్ చేసుకున్నట్లు సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల్లో మార్పులు చేయాలని, స్టోరీ విషయంలో మరికొన్ని సూచనలు కూడా చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దర్శకుడు మాత్రం తన విజన్ ప్రకారం సినిమా సరైన విధంగా సాగుతోందని భావించారట. ఇప్పటికే అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరుగుతోందని, పెద్దగా మార్పులు అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇంకేముంది.. అక్కడే ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తినట్లు చర్చ జరుగుతోంది. హీరో కోరిన మార్పులకు దర్శకుడు ఓకే చెప్పకపోవడం, డైరెక్టర్ ఆలోచనకు హీరో పూర్తిగా కనెక్ట్ కాకపోవడం వల్ల ప్రాజెక్ట్ ఫ్యూచర్ పై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ సినిమా ఇక ముందుకు సాగడం కష్టమేనని, ప్రస్తుతానికి నిలిచిపోయినట్లేనని ప్రచారం జరుగుతోంది.

అయితే ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. మూవీ టీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అందుకే ఆ వార్తలను పూర్తిగా నిజమని కూడా చెప్పలేం. కానీ హీరో, దర్శకుడి విజన్స్ ఒకేలా లేకపోతే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఇబ్బందుల్లో పడుతుందనే చర్చ మాత్రం మరోసారి జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ పై అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News