ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌కు స్క్రీనింగ్ ర‌ద్దు.. నెగెటివిటీకి నోలాన్ భ‌య‌ప‌డ్డాడా?

హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ప్రతిష్టాత్మక చిత్రం `ది ఒడిస్సీ` భారత‌దేశంలోను నిరంత‌ర చ‌ర్చ‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-07-04 01:27 GMT

హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ప్రతిష్టాత్మక చిత్రం `ది ఒడిస్సీ` భారత‌దేశంలోను నిరంత‌ర చ‌ర్చ‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న నోలాన్ అభిమానులు మూవీ రాక కోసం ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో `ది ఒడిస్సీ` కౌంట్‌డౌన్ ట్రైలర్ విడుదలయ్యాక యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో దాదాపు 80 వేలకు పైగా డిస్‌లైక్స్ సాధించి నోలన్ కెరీర్‌లోనే మోస్ట్ హేటెడ్ ట్రైలర్‌గా నిలిచింది. ఈ ట్రైలర్‌లో గ్రీక్ పురాణ కాలానికి సరిపోని అమెరికన్ యాక్సెంట్లు, పాత్రలు మాట్లాడే నేటి జెన్ -జి డైలాగులు (ఉదాహరణకు మాట్ డామన్ లెట్స్ గో! అనడం... రాబర్ట్ ప్యాటిన్సన్ పాత్ర డాడీ అనడం) ప్రేక్షకులకు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలో హాలీవుడ్ వర్గాల్లో ఇదొక పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ట్రైలర్‌పై వస్తున్న నెగెటివ్ రెస్పాన్స్‌తో అప్రమత్తమైన నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్, హాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న ఒక పెద్ద ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సినిమాలకు ముందే పాజిటివ్ హైప్ క్రియేట్ చేయడానికి టిక్‌టాకర్లు... ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్.. యూట్యూబర్ల కోసం వేసే ముందస్తు షోల‌ను ఈ సినిమాకు పూర్తిగా రద్దు చేశారు. జూలై 6న లండన్‌లో జరగనున్న‌ అధికారిక ప్రీమియర్ ముగిసేంతవరకు ఎవరికీ సినిమా చూపించకూడదని స్టూడియో లాక్ చేసింది.

ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సినిమా అనుకున్నంత రేంజ్‌లో రాలేదని.. థియేటర్లలోకి వచ్చేలోపు ఎక్కడ నెగెటివ్ టాక్ లీక్ అయి కలెక్షన్లపై దెబ్బకొడుతుందో అనే భయంతోనే స్టూడియో ఈ నిజమైన రియాక్షన్స్ ను దాచే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. గతంలో `రింగ్స్ ఆఫ్ పవర్` వంటి సిరీస్‌లకు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అద్భుతంగా ఉందంటూ పెయిడ్ ప్రమోషన్లతో ఊదరగొట్టారని... కానీ కంటెంట్ పరంగా అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయని గుర్తుచేస్తున్నారు. ఈ సినిమా కూడా ఒక `హర్రర్ షో` (డిజాస్టర్) కాబోతుందని, అందుకే యాక్సెస్ ఉన్న‌ మీడియాను కూడా దూరంగా పెట్టారని కొంద‌రు హాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్రెడిషనల్ ఫిలిం క్రిటిక్స్‌కు నోలన్ మద్దతు:

అయితే ఈ నాణేనికి మరో వైపు కూడా ఉంది. నోలన్ - యూనివర్సల్ స్టూడియోస్ కేవలం ఫ్రీ చిరుతిళ్లు - స్టూడియోల ఇచ్చే గిఫ్ట్ కార్డుల కోసం అడ్డగోలుగా పాజిటివ్ రివ్యూలు రాసే ఇన్‌ఫ్లుయెన్సర్ల కంటే... నిజాయితీగా సినిమాను విశ్లేషించే సాంప్రదాయ ప్రొఫెషనల్ ఫిలిం క్రిటిక్స్ కే ఈసారి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. కేవలం వ్యూస్ కోసం సోషల్ మీడియాలో ట్రైలర్‌ను ట్రోల్ చేస్తున్నారని, మూడు గంటల ఐమాక్స్ (IMAX) విజువల్ వండర్‌ను థియేటర్లలో చూశాక ప్రతి ఒక్కరి అభిప్రాయం మారుతుందని నోలన్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

భారీ బడ్జెట్ (250 మిలియన్ డాలర్లు) చిత్రాల ప్రమోషన్ల కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఆధారపడే `హైప్ బబుల్` ఇప్పుడు హాలీవుడ్‌లో బద్దలవుతోంది. నోలన్ తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ ఒక రకంగా మంచిదేన‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కేవలం 15 సెకన్ల రీల్స్ చేసేవారి కంటే సినిమాను లోతుగా విశ్లేషించేవారే ఇలాంటి క్లాసిక్ చిత్రాలకు సరైన న్యాయం చేయగలరు గ‌నుక కొద్దిరోజులు ఓపిక ప‌ట్టాల‌ని కొంద‌రు సూచిస్తున్నారు. జూలై 17న విడుదల కాబోతున్న ఈ గ్రీక్ పురాణ గాథ ప్రేక్షకులను మెప్పించి నోలన్ మార్కును నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి!


Full View


Tags:    

Similar News