• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్‌ ఫ్యాన్స్ మెచ్చే...

ప్రభాస్‌ ఫ్యాన్స్ మెచ్చే తంగలాన్ కామెంట్స్‌..!

| యంగ్ రెబల్‌ స్టార్‌ బాహుబలి తర్వాత పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ గా మారిన విషయం తెల్సిందే.

By - Tupaki Desk
Update: 2024-08-28 05:16 GMT

యంగ్ రెబల్‌ స్టార్‌ బాహుబలి తర్వాత పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ గా మారిన విషయం తెల్సిందే. బాహుబలి తర్వాత ఆయన నటించిన సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సలార్, కల్కి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపించిన విషయం తెల్సిందే. వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్‌ చేసిన ప్రభాస్‌ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఇటీవల ఒక బాలీవుడ్‌ నటుడితో పాటు, కొందరు హిందీ ఫిల్మ్‌ మేకర్స్ ప్రభాస్‌ పై విమర్శలు చేయడం జరిగింది. కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి, నటన గురించి హిందీ వారు చేసిన విమర్శలు తీవ్ర దుమారం ను రేపాయి. ప్రభాస్ కి మద్దతుగా చాలా మంది టాలీవుడ్‌ స్టార్స్‌ కూడా నిలవడం జరిగింది. మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ వారు కూడా ప్రభాస్‌ కి మద్దతుగా నిలవడం జరిగింది. కొందరు విమర్శిస్తే ఎంతో మంది ప్రభాస్ కి మద్దతుగా నిలుస్తున్న వారు ఉన్నారు. తాజాగా కోలీవుడ్‌ స్టార్‌ హీరో విక్రమ్‌ తన తంగలాన్ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

విక్రమ్‌ మాట్లాడుతూ... ప్రభాస్‌ ప్రస్తుతం ఒక తెలుగు హీరో మాత్రమే కాదు, ఆయన ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్‌. అతడి సినిమాల కోసం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ గురించి విక్రమ్‌ చేసిన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సాధారణంగా ఒక హీరో మరో హీరో గురించి పాజిటివ్‌ వ్యాఖ్యలు చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటిది విక్రమ్‌ వంటి స్టార్‌ హీరో ప్రభాస్ గురించి అలా మాట్లాడటం ఆయన గొప్పతనం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తమిళంతో పాటు అన్ని భాషల్లో విడుదల అయిన తంగలాన్ కి మంచి స్పందన వచ్చిన విషయం తెల్సిందే. ఇటీవల ఓటీటీ లో కూడా స్ట్రీమింగ్ అయిన తంగలాన్ కి అక్కడ కూడా మంచి రెస్పాన్స్‌ దక్కింది. ఇక ప్రభాస్‌ సినిమాల విషయానికి వస్తే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాలో ప్రభాస్‌ నటిస్తున్నాడు. మరో వైపు సీతారామం దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాను చేస్తున్నాడు. సలార్‌ 2 ఇంకా కల్కి 2 సినిమాలు కూడా చేయాల్సి ఉంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్‌ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రభాస్ మొదలు పెట్టబోతున్నాడు. మొత్తానికి ప్రభాస్ రాబోయే రెండేళ్లలో నాలుగు అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Tags:    
  • Chiyaanvikram 
  • Prabhas 
  • Vikram 
  • Thangalaan 
  • Kalki2898ad 
  • Filmindustry 
  • Panindianstar 
  • Salaar 
  • Rajasaab 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS