చిరు ఊచకోత: ఓదెల vs వంగా!

మరి సందీప్ వంగా వంతు వస్తే పరిస్థితి ఏంటి? అనేదే ఇప్పుడు అసలు పాయింట్. తన ఫేవరెట్ హీరో దొరికితే ఏ డైరెక్టర్ అయినా అంత ఈజీగా వదలడు.;

Update: 2025-11-24 19:01 GMT

మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఈ రెండు పేర్లు పక్కపక్కన కనిపిస్తేనే సోషల్ మీడియాలో వైబ్స్ వేరేలా ఉంటాయి. రీసెంట్ గా ప్రభాస్ 'స్పిరిట్' ఓపెనింగ్ ఈవెంట్ లో వీరిద్దరూ కలిసిన తీరు, చిరుని చూసి సందీప్ మురిసిపోయిన విధానం చూశాక మెగా ఫ్యాన్స్ లో కొత్త ఆశలు మొదలయ్యాయి. అయితే, ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడానికి ముందే ఇండస్ట్రీలో కొన్ని ఇంట్రెస్టింగ్ చర్చలు జరుగుతున్నాయి.

నిజానికి చిరంజీవిని సరికొత్తగా, వైల్డ్ గా చూపించే బాధ్యతను ఇప్పటికే మరో ఫ్యాన్ బాయ్ శ్రీకాంత్ ఓదెల తీసుకున్నాడు. గత ఏడాది ప్రకటించిన ఈ ప్రాజెక్ట్, నాని 'ప్యారడైజ్' సినిమా పూర్తయ్యాక సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. 'దసరా'తో తన టేకింగ్ ఏంటో చూపించిన ఓదెల, మెగాస్టార్ లోని వైల్డ్ యాంగిల్ ను పీక్స్ లో చూపించడానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. అంటే, సందీప్ వంగా కంటే ముందే మెగా మాస్ విశ్వరూపాన్ని ఓదెల చూపించబోతున్నాడన్నమాట.

మరి సందీప్ వంగా వంతు వస్తే పరిస్థితి ఏంటి? అనేదే ఇప్పుడు అసలు పాయింట్. తన ఫేవరెట్ హీరో దొరికితే ఏ డైరెక్టర్ అయినా అంత ఈజీగా వదలడు. సందీప్ కి మెగాస్టార్ ని డైరెక్ట్ చేయాలనే కోరిక బలంగా ఉంది. చిరు కూడా కంటెంట్ బాగుంటే, ట్రెండ్ కి తగ్గట్టు మారడానికి ఎప్పుడూ నో చెప్పరు. కానీ, ఇక్కడే ఒక చిన్న 'టెక్నికల్ ప్రాబ్లం' ఉంది.

సందీప్ మార్క్ సినిమా అంటేనే 'ఎక్స్‌ట్రీమ్ బోల్డ్ రొమాన్స్' 'హద్దులు లేని ఊచకోత'. చిరంజీవికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్లీన్ ఇమేజ్ కు, సందీప్ రాసే రా అండ్ రస్టిక్ బోల్డ్ సీన్స్ సెట్ అవుతాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 'యానిమల్' రేంజ్ వైలెన్స్ ను మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కానీ, అందులో ఉండే బోల్డ్ డ్రామా చిరుకి ఎంతవరకు సూట్ అవుతుందనే సందేహం అందరిలోనూ ఉంది.

ఏది ఏమైనా, శ్రీకాంత్ ఓదెల సినిమా ఒక టీజర్ మాత్రమే అనుకుంటే, భవిష్యత్తులో సందీప్ వంగాతో సినిమా కుదిరితే అది 'సినిమాటిక్ బ్లాస్ట్' లా ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఆ కాంబో గనుక సెట్ అయితే, బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట కాదు, సాక్షాత్తూ 'ఊచకోత' జరుగుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం బంతి చిరు కోర్టులో ఉంది.. ఇక వంగా మార్క్ వైల్డ్ రైడ్ కి బాస్ సిద్ధమేనా అనేది చూడాలి.

Tags:    

Similar News