157 లో త‌మ‌న్నాకు ఛాన్స్ లేదా?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్ గారు` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-11-15 20:30 GMT

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్ గారు` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే ముగింపు ద‌శ‌లో ఉంది. లిరిక‌ల్ సాంగ్స్ ఒక్కొక్క‌టిగా రిలీజ్ అవుతున్నాయి. మీసాలా పిల్ల సాంగ్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. చిరు-న‌య‌న్ రొమాన్స్ ఆక‌ట్టుకుంటుంది. ఇదంతా స‌రే? సినిమాలో అస‌లైన మాస్ మ‌సాలా సాంగ్ ప‌రిస్థితి ఏంటి? అంటే ప్ర‌స్తుతం డిస్క‌ష‌న్ అంతా ఆ పాట గు రించి జ‌రుగుతోంది. చిరు స‌ర‌స‌న ఐటం పాట‌లో న‌ర్తించే భామ ఎవ‌రు? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ నేప‌థ్యంలో పాట కోసం మిల్కీబ్యూటీ త‌మ‌న్నాను రంగంలోకి దించుతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అనీల్ రావిపూడి ఆమెతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని, ఆమె ఎంట్రీ దాదాపు ఖాయ‌మైంద‌నే ప్ర‌చారం బ‌లంగానే జ‌రుగుతోంది. సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ జోడీగా సెట్ అవ్వ‌డంతో పాటు బోల్డ్ అప్పిరియ‌న్స్ ఇవ్వ‌డంలోనూ త‌మ్మ‌న్నా అయితే బ్యాలెన్స్ చేస్తుంద‌ని అన్న కోణంలో ఆమెనే తీసుకుంటున్న‌ట్లు వినిపిస్తోంది. తాజా స‌మాచారం ఏంటంటే? త‌మ‌న్నా కంటే కొత్త భామతోనే ముందుకెళ్లాల‌ని అనీల్ భావిస్తున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది.

త‌మ‌న్నా ఇప్ప‌టికే చాలా సినిమాల్లో ఐటం పాటల్లో న‌టించ‌డంతో కొత్త‌ద‌నం ఉండ‌ద‌ని భావించి ఆ న‌టికి బ‌ధులుగా మ‌రో సీనియ‌ర్ లేదా? కొత్త భామ‌ను తీసుకుంటే బాగుంటుంద‌ని అనీల్ అసిస్టెంట్ స‌ల‌హా ఇవ్వ‌డంతో? ప్లాన్ మారు స్తున్న‌ట్లు తెలిసింది. ఈ విష‌యం చిరంజీవి దృష్టికి కూడా తీసుకెళ్లారుట‌. ఆయ‌న కూడా ఆ విష‌యంలో తాను ఇన్వాల్వ్ కాన‌ని..త‌మ ఇష్టం మేర‌కే ఎంపిక చేయండ‌ని సూచించారుట‌. దీంతో ఐటం భామ ఎంపిక పూర్తిగా అనీల్ హాండ్స్ లోనే ఉంద‌ని తెలుస్తోంది. చిరంజీవి సినిమా అంటే ఐటం పాట‌లో ఓ వైబ్ ఉంటుంది.

త‌న‌దైన మార్క్ సిగ్నెచ‌ర్ స్టెప్స్ ఉంటాయి. ఆయ‌న గ్రేస్ ను అందుకుని ఏ న‌టి అయినా డాన్స్ చేయాల్సి ఉంటుం ది. ఈ నేప‌థ్యంలో ఐటం పాట‌లో ఎంపిక‌య్యే ఏ న‌టి అయినా మంచి డాన్స‌ర్ కూడా అయి ఉండాలి. అలాంటి పెర్పార్మ‌న్ ని వెతికి ప‌ట్టుకోవ‌డం అంత సుల‌భం కాదు. అందంతో పాటు మంచి డాన్స‌ర్ అయి ఉండాలి. ఐటం పాట‌లో ఒకే ఎన‌ర్జీతో ప‌ని చేయ‌గ‌ల‌గాలి. మ‌రి ఆ ఛాన్స్ ఏ న‌టికి ద‌క్కుతుందో చూడాలి.

Tags:    

Similar News