మెగా ప్లాన్ లో బాబీ.. సూపర్ అప్డేట్..!

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నట్టు తెలుస్తుంది.;

Update: 2026-01-07 09:30 GMT

మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా క్రేజీగా ఉండబోతుంది. బాబీ చిరు కాంబో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నట్టు తెలుస్తుంది.

చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్..

మెగా 158వ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయట. దాదాపు ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటున్నారట మేకర్స్. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. మెగా అభిమాని అయిన బాబీ ఈ సినిమాను మెగా ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అందించేలా ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే కథ, కథనాల మీద కసరత్తు చేస్తున్నారు.

బాబీ టేకింగ్ ఇప్పటికే ఆడియన్స్ సూపర్ అనేశారు. లాస్ట్ ఇయర్ డాకు మహారాజ్ సినిమాతో ఆయన మంచి జోష్ అందించారు. ఇక నెక్స్ట్ చిరుతో మరో మాస్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మెగాస్టార్ మాస్ స్టామినా చూపించేలా ఉంటుందట. సినిమాలో ఐశ్వర్య రాయ్ నటించడం కూడా ప్లస్ అని చెప్పొచ్చు. మెగా మూవీకి రెహమాన్ మ్యూజిక్, ఐశ్వర్య రాయ్ గ్లామర్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.

చిరంజీవి శ్రీకాంత్ ఓదెల..

మెగా మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టరైజేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. తెలుగులో ఐశ్వర్య రాయ్ చాలా తక్కువ సినిమాలు చేశారు. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఇక్కడ కూడా ఐశ్వర్యాకి మంచి పాపులారిటీ ఉంది. అందుకే మెగాస్టార్ కి ఆమె జోడీ అయితే అదుర్స్ అనేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తుంది. ఈ సినిమా తర్వాత విశ్వంభర ఈ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ ఉంది. బాబీ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ సెకండ్ హాఫ్ రిలీజ్ ఉండొచ్చని టాక్.

బాబీ కూడా మెగా బాస్ కి ఒక మెమరబుల్ హిట్ ఇవ్వాలని ఉత్సాహంగా ఉన్నారు. రీసెంట్ గా సుజీత్ తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఓజీ తో సూపర్ హిట్ ఇచ్చాడు. బాబీ కూడా మెగాస్టార్ మీద ఉన్న అభిమానం ఫ్యాన్స్ ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపిస్తారని తెలుస్తుంది. బాబీ చిరు కాంబో సినిమా పై ఈ అప్డేట్స్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందిస్తున్నాయి. మరి మెగా 158 మాస్టర్ ప్లాన్ చూస్తుంటే టార్గెట్ భారీగానే ఉన్నట్టు ఉందనిపిస్తుంది.

Tags:    

Similar News