చిరంజీవి బర్త్ డే.. డబుల్ ప్లాన్స్..?

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వచ్చేస్తుంది. ఆ రోజు ఫ్యాన్స్ కోసం మెగా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.;

Update: 2025-08-12 09:24 GMT

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వచ్చేస్తుంది. ఆ రోజు ఫ్యాన్స్ కోసం మెగా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం మెగాస్టార్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర కాగా.. మరొకటి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న సినిమా. ఈ రెండు సినిమాల నుంచి బర్త్ డే అప్డేట్స్ రాబోతున్నాయని తెలుస్తుంది. ఐతే విశ్వంభర సినిమా నుంచి ఒక టీజర్ ని వదలాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.

మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ కన్ఫర్మ్..

ఐతే దానికి సంబంధించిన సీజీ ఫైనల్ మిక్సింగ్ కావాల్సి ఉందట. ఒకవేళ అది కుదరకపోతే మాత్రం అనిల్ రావిపూడి సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తారట. ఒకవేళ విశ్వంభర టీజర్ రెడీ అయితే మాత్రం అనిల్ రావిపూడి మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేస్తారట. సో మొత్తానికి చిరు బర్త్ డేకి కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ కన్ ఫర్మ్ అని చెప్పొచ్చు.

ఐతే విశ్వంభర రిలీజ్ టైం కి ఇంకా టీజర్ సీజీ రెడీ అవ్వకపోవడం ఏంటని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. సినిమాను వశిష్ట భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సినిమా గురించి ఆయన వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. కానీ ఎందుకో విశ్వంభర మీద మాత్రం బజ్ తీసుకు రాలేకపోతున్నారు. ఆమధ్య వచ్చిన ఒక సాంగ్ కూడా అంత బజ్ క్రియేట్ చేయలేదు. విశ్వంభర సినిమా విషయంలో అసలేం జరుగుతుందో మెగా ఫ్యాన్స్ కన్ ఫ్యూజన్ లో ఉన్నారు.

చిరంజీవి చాలా సంతృప్తిగా..

విశ్వంభర సినిమాలో చిరంజీవి తో త్రిష స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. సినిమాలో ఆమెతో పాటు ఆషిక రంగనాథ్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా విజువల్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. సినిమా రిలీజ్ ఎప్పుడన్నది కూడా ఆగష్టు 22న వచ్చే అప్డేట్ తో రివీల్ చేస్తారని తెలుస్తుంది.

అనిల్ రావిపూడి సినిమా మాత్రం ఒక రేంజ్ లో దూసుకెల్తుంది. సినిమా విషయంలో చిరంజీవి చాలా సంతృప్తిగా ఉన్నారని టాక్. మెగా 157 సినిమా నుంచి టీజర్ వచ్చినా, పోస్టర్ వచ్చినా ఫ్యాన్స్ కి మాత్రం కచ్చితంగా మజా తెప్పిస్తుందని అంటున్నారు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. మెగా 157లో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మెగా 158వ సినిమా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తుంది. ప్రస్తుతం నానితో ప్యారడైజ్ చేస్తున్న శ్రీకాంత్ చిరు సినిమాను ఆ మూవీ రిలీజ్ తర్వాత చేస్తాడని తెలుస్తుంది.

Tags:    

Similar News