మీరు చూసింది ఒరిజినల్ చిరంజీవినే.. 95 శాతం అది న్యాచురల్ లుక్

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ప్రకటించేశారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఇవాళ మేకర్స్ టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ వదిలారు.;

Update: 2025-08-22 10:03 GMT

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ప్రకటించేశారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఇవాళ మేకర్స్ టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ వదిలారు. ఈ సినిమాకు మన శంకరవర ప్రసాద్ టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే గ్లింప్స్ లో చిరు లుక్స్ ఆకట్టుకున్నాయి. 70ఏళ్లైనా యంగ్ హీరోలకు పోటీనిచ్చే స్టైల్, శ్వాగ్ తో ఆయన లుక్స్ అభిమానులకే కాదు సినీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే మన శంకరవర ప్రసాద్ గారు గ్లింప్స్ లాంచ్ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి పాత్ర గురించి ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. సినిమాలో చిరు లుక్స్ ఒరిజినల్ అండ్ నేచురల్ అని, దీని కోసం ఎలాంటి గ్రాఫిక్స్ వాడలేదని స్పష్టం చేశారు. గ్రాఫిక్స్ లేకుండానే నేచురల్ లుక్స్ రాబట్టడంలో సక్సెస్ అయినట్లు అనిల్ చెప్పారు.

ఈ గ్లింప్స్ లాంచ్ కార్యక్రమంలో రావిపూడి మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక శాంపిల్ మాత్రమే. ఇలాంటివి సినిమాలో ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి. లుక్ వైస్ క్రెడిట్ ఇవ్వాలంటే.. నేను చిరంజీవి గారికే ఇస్తాను. గ్లింప్స్ లో చూసిందంతా ఒరిజినల్. ఆయన కోసం పెద్దగా వీఎఫ్ ఎక్స్ చేసిందేమీ లేదు. మీరు చిరంజీవి గారిని చూసింది దాదాపు 95 శాతం ఒరిజినల్.

ఈ పాత్ర కోసం ఆయన బాగా వెయిట్ లాస్ అయ్యారు. లుక్ వైస్ బాగా కేర్ తీసుకున్నారు. కఠినమైన జిమ్ రొటీన్, ఉదయం, సాయంత్రం శిక్షణతో చాలా బరువు తగ్గారు. అందుకే ఇప్పుడు ఆయన 45-50 ఏళ్ల వారిలాగా కనిపిస్తున్నారు. అలాంటి లుక్ దక్కడం నా అదృష్టం. అని అనిల్ అన్నారు.

గ్లింప్స్ లో చిరు నిజంగానే చాలా స్టైలిశ్ గా కనిపించారు. బ్లాక్ సూట్‌, కళ్లజోడు ధరించి, నోట్లు సిగరెట్ పెట్టుకొని స్టైల్ గా కారులోంచి దిగారు. చేతిలో తుపాకీ పట్టుకొని స్టైల్గా వాకింగ్ చేయడం గ్లింప్స్లో హైలైట్ గా నిలిచింది. ఇక వీడియో ఆఖర్లో పొగ మంచుతో నిండిన వాతావరణంలో చిరంజీవి గుర్రంతో కలిసి నడుస్తున్న షాట్ సినిమాపై అంచనలను మరో లెవెల్ తీసుకెళ్తుంది.

కాగా, ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags:    

Similar News