రామ్ చరణ్ -బన్నీ కలిసేదెప్పుడు! కలిపేదెవరు?
కానీ అంతకన్నా మించి ఆనందాన్నిపంచేది చరణ్-బన్నీ కలిసి పని చేయడం అన్నది. తమ అభిమాన తారలిద్దర్నీ ఒకే ప్రేమ్ లో చూడాలని అభిమానులు ఇప్పటి నుంచి కాదు కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు.;
మల్టీస్టారర్ అన్నది తెలుగు సినిమాకిప్పుడు చిన్న పదంలా మారిపోయింది. కలిసి పనిచేయడానికి స్టార్ హీరోలెవరు వెనుకాడుటం లేదు. హీరోల ఇమేజ్ తగ్గ కథ కుదరాలేగానీ మ్యాకప్ వేసుకోవాడినికి సిద్దమంటూ ముందుకొస్తున్నారు. సీనియర్ హీరోల నుంచి తర్వాత తరం హీరోల వరకూ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్-రామచరణ్ పని చేసారు. విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ ఓ సినిమా చేసారు. వెంకటేష్-మహేష్ కాంబోలో ఓ సినిమా వచ్చింది. వెంకీ-పవన్ కళ్యాణ్ కూడా కలిసి పని చేసారు. చిరంజీవి-వెంకటేష్ కూడా ఓ సినిమా కలిసి చేస్తున్నారు.
ఇద్దరు పాన్ ఇండియా స్టార్లే:
ఇలా ఇన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్ అయ్యాయి? బన్నీ -చరణ్ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియాలో సత్తా చాటుతోన్న నేపథ్యంలో ఈ క్రేజీ కాంబోపై చర్చమొ దలైంది. `ఆర్ ఆర్ ఆర్` తో చరణ్ పాన్ ఇండియాను దాటి గ్లోబల్ రేంజ్ కి రీచ్ అయ్యాడు. `పుష్ప` సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రంతో ఇంటర్నేషనల్ కి రీచ్ అవుతాడు. ఇలా ఇద్దరు స్టార్లు మార్కెట్ పరంగా అంతకంతకు విస్తరించడం అన్నది అభిమానులకు ఎంతో సంతోషకరమైందే.
`ఎవడు` తో తొలిసారి:
కానీ అంతకన్నా మించి ఆనందాన్నిపంచేది చరణ్-బన్నీ కలిసి పని చేయడం అన్నది. తమ అభిమాన తారలిద్దర్నీ ఒకే ప్రేమ్ లో చూడాలని అభిమానులు ఇప్పటి నుంచి కాదు కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. దశాబ్దాలు మారు తున్నా? ఆ సన్నివేశం మాత్రం చోటు చేసుకోవడం లేదు. గతంలో రామ్ చరణ్ హీరోగా నటించిన `ఎవడు` లో బన్నీ నటించాడు. కానీ అది కాసేపు కనిపించే పాత్ర మాత్రమే. పుల్ లెంగ్త్ రోల్ కాదు. అదీ ఇన్నో వేటివ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన చిత్రం కావడంతో సాధ్యమైంది.
ఆ ద్వయం కోసం ఆయనే దిగాలా:
అలాంటి సమయంలో చేసిన చిత్రమే `ఎవడు`. మరి ఈసారి ఇద్దరు కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నారా? అన్నది తెలియాలి. మరి ఆ కాంబినేషన్ ని కలిపేది ఎవరు? వారి ఇమేజ్ కు తగ్గ స్టోరీ ఏ రైటర్ తో సాధ్యమ వుతుందో చూడా లి. కానీ అదంత వీజీకాదు. ప్రస్తుతం ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు కాబట్టి రాసే కథ ఆ రేంజ్ లో ఉండాలి. వాళ్ల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కలం కదలాలి. అంత టి సత్తా ఉన్న రైటర్ ఎవరు? అంటే విజయేంద్ర ప్రసాద్ మాత్రమే కనిపిస్తున్నారు.