ప్ర‌భాస్ ఛాన్స్ ఇచ్చాడు..బ‌న్నీ ఇంకా ఇవ్వ‌డా?

పైన‌ల్ గామారుతి కామెడీ కంటెంట్ కి ప్ర‌భాస్ పెద్ద ప్యాన్ అన్న‌సంగ‌తి త‌ర్వాత వెలుగులోకి రావ‌డంతో మ్యాట‌ర్ అర్ద‌మైంది.

Update: 2024-04-30 02:45 GMT

ప్రభాస్ తో మారుతి సినిమా అనే ప్ర‌క‌ట‌న రాగానే అంతా షాక్ అయిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ మారుతి సినిమానా? అంటూ ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఆ కాంబోలో ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింద‌ని సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి.పైన‌ల్ గామారుతి కామెడీ కంటెంట్ కి ప్ర‌భాస్ పెద్ద ప్యాన్ అన్న‌సంగ‌తి త‌ర్వాత వెలుగులోకి రావ‌డంతో మ్యాట‌ర్ అర్ద‌మైంది. అదే న‌మ్మ‌కంతో 'రాజా సాబ్' చేస్తున్నాడు. సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. న‌మ్మి డార్లింగ్ మారుతికి అవ‌కాశం బాగానే ఇచ్చాడు.


కానీ న‌మ్మిన బ‌న్నీ మాత్రం ఇంకా మారుతికి అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. అత‌డితో మారుతి సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్న‌ది ఓపెన్ సీక్రెట్. మారుతికి ద‌ర్శ‌కుడిగా పేరు వ‌చ్చిన నాటి నుంచి బ‌న్నీతో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నాని...వెంక‌టేష్ లతో ప‌నిచేసాడు ఇప్ప‌టికే.. చివ‌రికి చిరంజీవి లాంటి స్టార్ హీరో కూడా మారుతికి అవ‌కాశం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు గానీ...బ‌న్నీనుంచి మాత్రం పిలుపు రావ‌డం లేదు.

Read more!

మ‌రి ఆ అవ‌కాశం కూడా ద‌గ్గ‌ర్లోనే ఉన్న‌ట్లు చెప్పొచ్చు . 'రాజాసాబ్' తో గ‌నుక డార్లింగ్ కి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తే బ‌న్నీ నుంచి పిలుపు పెద్ద విష‌యం కాదు. ట్యాలెంట్ ని ఎంక‌రేజ్ చేయ‌డంలో ముందుంటాడు. పైగా మారుతి బ‌న్నీ కావాల్సిన వాడిగా భావిస్తారు. ట్యాలెంట్ తో ఎదిగిన ప్ర‌తిభావంతుడి మారుతికి ఓ గుర్తింపు ఉంది. కానీ కంటెంట్ ప‌రంగా ఇంకా మారుతి షైన్ అవ్వాల్సి ఉంది. ల‌ఇప్ప‌టికే అత‌డిపై ఉన్న‌కొంత నెగివిటీని తొల‌గించుకోల‌గాడు.

సాప్ట్ కంటెంట్ తో సినిమాలు చేస్తున్నాడ‌నే ప్ర‌శ‌సంలు అందుకుంటున్నాడు. కాబ‌ట్టి బ‌న్నీకి అతి చేరువ‌లోనే మారుతి ఉన్నాడనొచ్చు. అందుకు రాజాసాబ్ హిట్ కీల‌క పాత్ర పోష‌స్తుంది. మారుతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కూడా. పుష్ప‌-2 విజ‌యంతో ఆ క్రేజ్ రెట్టింపు అవుతుంది. అటుపై అట్లీతో సినిమా చేస్తాడు. మారుతి క‌థ రాసే ముందు ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకుని రాయాల్సి ఉంది సుమీ.

Tags:    

Similar News