మాఫియాతో పరిచయం కెరీర్ నే కోల్పోయిన న‌టుడు!

90వ దశకంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను అండర్‌వరల్డ్ మాఫియా ఏ విధంగా శాసించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2026-05-20 01:30 GMT

90వ దశకంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను అండర్‌వరల్డ్ మాఫియా ఏ విధంగా శాసించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సమయంలో ఎంతో మంది నటీనటులు, దర్శకులు ,నిర్మాతలు మాఫియా డాన్‌ల నుండి బెదిరింపులను ఎదుర్కొన్నారు. కొందరు ఒత్తిళ్లకు లొంగిపోయి కెరీర్‌ను పాడు చేసుకోగా, మరికొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా నాటి తరం ప్రముఖ నటుడు గోవిందా తో కలిసి పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఓ ప్రముఖ నటుడి జీవితం, అండర్‌వరల్డ్‌తో ఏర్పడిన ఒక్క చిన్న పరిచయం కారణంగా ఎలా తారుమారైందో? అతని బాలీవుడ్ కెరీర్ ఎలా ముగిసిపోయింది? అన్న‌దానిపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

90లలో గోవిందాతో పాటు ధర్మేంద్ర, సైఫ్ అలీ ఖాన్ వంటి అగ్ర హీరోల చిత్రాలలో సహాయ నటుడిగా, విలన్‌గా మెప్పించిన సదరు నటుడు ఇండస్ట్రీలో మంచి పొజిషన్‌లో ఉండేవారు. అయితే ఆ సమయంలో ముంబైని కుదిపేస్తున్న మాఫియా ముఠాలతో అతనికి కొన్ని అనాలోచిత సంబంధాలు ఏర్పడ్డాయి. పార్టీ .. దుబాయ్ ఈవెంట్ వేదికగా అండర్‌వరల్డ్ కింగ్‌పిన్స్‌తో అతను దిగిన కొన్ని ఫోటోలు, వారితో జరిపిన సంభాషణలు ఆ తర్వాత పోలీసుల నిఘా విభాగం దృష్టికి వెళ్లడం ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. అండర్ వరల్డ్ కనెక్షన్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో? అప్పటి వరకు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించిన బాలీవుడ్ నిర్మాతలు , దర్శకులు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు.

మాఫియాతో సంబంధాలు ఉన్న నటుడిని తమ సినిమాల్లో పెట్టుకుంటే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని, అలాగే సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురవుతాయని భయపడి రాత్రికి రాత్రే అతనికి ఆఫర్లు ఇవ్వడం బంద్ చేశారు. ఆ ర‌కంగా కొన్ని తప్పుడు పరిచయాల వల్ల సదరు నటుడి సినీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే బాలీవుడ్‌లో పూర్తిగా ముగిసిపోయింది. సరిగ్గా ఇదే తరహా అనుభవాలను బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర సైతం ఎదుర్కొన్నట్లు పాత జ్ఞాపకాలను సినీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆ కాలంలో అండర్‌వరల్డ్ నుండి వచ్చే ఫోన్ కాల్స్, బెదిరింపుల వల్ల నటీనటులు ఎంతటి మానసిక క్షోభను అనుభవించేవారో చెప్పడానికి ఈ సంఘటనలే నిదర్శనం.

అయితే కొందరు హీరోలు ధైర్యంగా నిలబడి ఆ ఒత్తిడిని అధిగమించగా ఈ నటుడు మాత్రం మాఫియా నీడలో చిక్కుకుని పరిశ్రమకు , ప్రేక్షకులకు శాశ్వతంగా దూరమవ్వాల్సి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ ఎంత ముఖ్యమో? ఎంచుకునే స్నేహాలు , పరిచయాలు కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన నిరూపించింది.ప్రస్తుత బాలీవుడ్ వాతావరణం అప్పటితో పోలిస్తే ఎంతో కార్పొరేట్ గా .. పారదర్శకంగా మారింది. ముంబై పోలీసుల కఠిన చర్యలతో చిత్ర పరిశ్రమపై అండర్‌వరల్డ్ ప్రభావం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఒకప్పుడు వెండితెర వెనుక నడిచిన ఈ చీకటి కథలు, నటీనటుల జీవితాలను ఎలా నాశనం చేసాయో! వింటే నేటి తరం సినీ ప్రియులు సైతం ఆశ్చర్యపోతున్నారు. గోవిందా కో-స్టార్ ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం బాలీవుడ్ చరిత్రలోనే బ్లాక్ మార్క్‌గా మిగిలిపోయింది.

Tags:    

Similar News